Begin typing your search above and press return to search.

వెంకీ కోసం వ‌క్కంతం క‌థ‌

By:  Tupaki Desk   |   21 Jan 2016 5:30 PM GMT
వెంకీ కోసం వ‌క్కంతం క‌థ‌
X
‘గోపాల గోపాల’ సినిమా త‌ర్వాత దాదాపు ఏడాది విరామం తీసుకున్నాడు విక్ట‌రీ వెంక‌టేష్. ఐతే ఈ లాంగ్ గ్యాప్ క‌వ‌రైపోయేలా ఇక య‌మ స్పీడుగా సినిమాలు చేసేయాల‌ని ఫిక్స‌య్యాడు ద‌గ్గుబాటి క‌థానాయ‌కుడు. ఇప్ప‌టికే దాస‌రి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ‘బాబు బంగారం’ సినిమా మొద‌లుపెట్టి శ‌ర‌వేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. నెల కింద‌ట షూటింగ్ మొద‌లైతే అప్పుడే 40 శాతం సినిమా పూర్త‌యిపోయినట్లు స‌మాచారం. ఇంకో రెండు నెల‌ల్లోనే సినిమా పూర్త‌యిపోవ‌చ్చ‌ని తెలుస్తోంది. వేస‌వికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. ఈ సినిమా పూర్త‌య్యే స‌మయానికే వెంకీ కోసం మ‌రో రెండు స్క్రిప్టులు రెడీగా ఉంటాయి.

మ‌లయాళంలో ‘దృశ్యం’ సినిమా తీసి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన జీతు జోసెఫ్.. వెంకీతో ఓ సినిమా చేయాల్సి ఉంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్సే ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. మ‌రోవైపు స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ కూడా వెంకీ కోసం ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వెంకీకి లైన్ చెప్పి ఓకే చేయంచుకున్న వ‌క్కంతం.. పూర్తి స్థాయి స్క్రిప్టు రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు. ఎన్టీఆర్ హీరోగా న‌టించే సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయాల్సిన వక్కంతం ఆ సినిమాకు కూడా స్క్రిప్టు త‌యారు చేసుకోవాల్సి ఉంది. ఐతే దానికి చాలా టైం ఉండ‌టంతో ఈ లోపు వెంకీ సినిమాకు స్క్రిప్టు రాస్తున్నాడు. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ నిర్మించ‌బోతున్నాడు. అత‌నింత‌కుముందు వెంకీతో ల‌క్ష్మీ సినిమా చేశాడు.