Begin typing your search above and press return to search.

సురేందర్ రెడ్డికి నో.. రవితేజకు ఓకే

By:  Tupaki Desk   |   6 Feb 2017 8:29 AM GMT
సురేందర్ రెడ్డికి నో.. రవితేజకు ఓకే
X
విజయ్ భాస్కర్-త్రివిక్రమ్ శ్రీనివాస్.. శ్రీను వైట్ల-కోన వెంకట్ లాగే సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీలది కూడా సూపర్ హిట్ డైరెక్టర్-రైటర్ జోడీ. వీళ్లిద్దరూ చాన్నాళ్ల పాటు మంచి సమన్వయంతో పని చేశారు. ఒక దశలో వక్కంతం లేకుండా సురేందర్ సినిమా చేయడు.. చేయలేడు అనే పరిస్థితి వచ్చింది. అంత సమన్వయం ఉండేది వాళ్లిద్దరికీ. కానీ ‘కిక్-2’ దగ్గర ఇద్దరికీ తేడా వచ్చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో సురేందర్ కొత్త సినిమా ‘ధృవ’కు వక్కంతం పని చేయకపోవడం ఈ సందేహాలకు బలం చేకూర్చింది.

ఐతే వక్కంతం దర్శకుడిగా మారుతున్నందువల్లే అతను సురేందర్‌ తో కలిసి పని చేయట్లేదన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ ఓవైపు తన డైరక్టోరియల్ డెబ్యూకు సన్నాహాలు చేసుకుంటూనే.. రైటింగ్ కూడా కొనసాగిస్తున్నాడు వక్కంతం. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ రవితేజ హీరోగా తెరకెక్కించబోయే ‘టచ్ చేసి చూడు’ చిత్రానికి వక్కంతం వంశీనే కథ అందించడం విశేషం. తనదైన స్టయిలో ఒక టిపికల్ మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్టు అందించాడట వక్కంతం. ‘టెంపర్’ తర్వాత వక్కంతం సురేందర్ కాకుండా వేరే వాళ్ల కోసం రాసిన కథ ఇదే కావడం విశేషం. దీని తర్వాత అతను బయటి వాళ్లకు కథలు ఇచ్చే అవకాశం లేనట్లే. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడిగా తన తొలి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు వక్కంతం. మరోవైపు సురేందర్.. కొత్త రచయితల సహకారంతో చిరంజీవి సినిమాకు స్క్రిప్టు తయారు చేసుకుంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/