Begin typing your search above and press return to search.

ఫ్లయిట్ లో కలిశాడు.. బన్నీ ఛాన్సిచ్చాడు

By:  Tupaki Desk   |   25 Nov 2016 9:30 AM GMT
ఫ్లయిట్ లో కలిశాడు.. బన్నీ ఛాన్సిచ్చాడు
X
ఒక్కోసారి కెరీర్ టర్న్ ఎలా వస్తుందో ముందుగా అంచనా వేయడం కష్టం. స్టార్ రైటర్ స్టేటస్ ఉన్నా.. దర్శకుడిగా మారేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వక్కంతం వంశీ. ఇలాంటి సమయంలో ఫ్లైట్ లో అనుకోకుండా అల్లు అర్జున్ తో కలిసి చేసిన విమాన ప్రయాణం.. వంశీని దర్శకుడి కుర్చీలోకి చేర్చింది.

ఓ ప్రయాణంలో అనుకోకుండా ఇద్దరూ కలిసి ఫ్లయిట్లో జర్నీ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఇద్దరూ కాసేపు మాట్లాడుకోవడం.. బన్నీకి వక్కంతం వంశీ ఓ స్టోరీ లైన్ వినిపించడం.. అది బన్నీకి సూపర్బ్ గా నచ్చేయడంతో.. ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ అయింది. అప్పటికే బన్నీ-వంశీలు కలిసి పని చేశారు. రేసుగుర్రం.. ఎవడు చిత్రాలకు ఇద్దరూ కలిసి వర్క్ చేయడంతో.. వంశీ సామర్ధ్యం గురించి.. మేకింగ్ లో అతని ఐడియాలజీ గురించి బన్నీకి ఐడియా ఉంది. అందకే ఏమాత్రం ఆలోచించకుండా.. వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

సరైనోడు బ్లాక్ బస్టర్.. వరుసగా 50 కోట్లకు పైగా షేర్ సాధించిన సినిమాలు ఐదు ఉన్న ఏకైక హీరో అనే రికార్డు ఉన్న బన్నీ.. ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం అన్నదే అసలైన హైలైట్ పాయింట్. ఇప్పుడీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లగడపాటి శ్రీధర్.. నాగబాబు నిర్మాతలుగా ఈ మూవీ తెరకెక్కనుంది. హరీశ్ శంకర్ తో చేస్తున్న దువ్వాడ జగన్నాధం పూర్తి కాగానే.. వక్కంతం వంశీతో సినిమా స్టార్ట్ చేస్తాడట బన్నీ. 2017లోనే దీన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/