Begin typing your search above and press return to search.
వక్కంతంకి స్నేహితుడు తారక్ ఛాన్సిస్తాడా?
By: Tupaki Desk | 6 Sept 2020 6:00 AM ISTసక్సెస్ వెంటే పడతారు మన స్టార్ హీరో .. ! అంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ని ఇంకా ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేదు. నిజమే.. ఇండస్ట్రీ ఎప్పుడూ హిట్టు వెంటే పడుతుంది. ఆ ఒక్కటీ రాకపోతే ఇండస్ట్రీలో మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల బిజినెస్ డీల్స్ లో సక్సెస్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి. ఫ్లాప్ వస్తే తట్టుకోలేరు కాబట్టి.
సూపర్ స్టార్ మహేష్ ని ఉద్ధేశించి పూరి అంత ఘాటైన వ్యాఖ్య చేసినా కానీ అతడేమీ బయటపడలేదు. కొంత గ్యాప్ ఇచ్చి డీసెంట్ గా మరోసారి పిలిచి పూరీతో మంతనాలు సాగించాడు. నమ్రతనే స్వయంగా వెళ్లి స్క్రిప్టు ఉంటే చెప్పాల్సిందిగా అడగడంతో చల్లబడ్డారు.
అదంతా సరే కానీ.. `నా పేరు సూర్య` లాంటి డిజాస్టర్ సినిమా తీశాడు వక్కంతం వంశీ. గొప్ప బ్లాక్ బస్టర్ చిత్రాల రచయితగా వెలిగిపోయిన వక్కంతం డెబ్యూ డైరెక్షన్ విషయంలో తడబడ్డాడు. `వ్యక్తిత్వం- దేశభక్తి` అనే బలమైన ఎలిమెంట్ ని ఎంచుకుని కథనాన్ని సీరియస్ గా నడిపించడంతో ఆశించిన విజయం దక్కలేదు. అయినా బన్ని క్యారెక్టరైజేషన్ ని మెచ్చుకోని వాళ్లు లేరు. నిజానికి ఇలాంటి సినిమాలు వెండితెరపై కంటే బుల్లితెరపై చూసినప్పుడు సర్ ప్రైజ్ ట్రీట్ లా ఉంటుంది. కామెడీ.. ఎంటర్ టైన్ మెంట్ అనే అంశాల్ని లైట్ తీస్కోవడం కూడా నా పేరు సూర్యకు సమస్యాత్మకం అయ్యిందని క్రిటిక్స్ విమర్శించారు.
అదంతా సరే కానీ.. తొలి ప్రయత్నం డిజాస్టర్ రిజల్ట్ వచ్చినందుకు ఇన్నాళ్లు వేరొక స్టార్ హీరో ఎవరూ వక్కంతంకి అవకాశం ఇవ్వలేదు. కానీ అతడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా రెండో సినిమా కోసం స్క్రిప్టు పట్టుకుని హీరోని వెతుకుతున్నాడని చాలాకాలంగా ప్రచారమవుతోంది. మరి స్నేహితుడు ఎన్టీఆర్ అతడికి అవకాశం ఇస్తాడా? త్రివిక్రమ్.. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత అయినా తనకో ఆఫర్ ఇచ్చి లిఫ్టిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి వక్కంతం వేరొక హీరోతో సినిమా చేసినా కానీ ఎన్టీఆర్ లాంటి ఫ్రెండు ఆదుకోవడం అత్యావశ్యకం. ఇటీవలే తారక్ తో వక్కంతం మంతనాలు సాగించాడట. టెంపర్ టైమ్ నుంచి కలిసి పని చేయాలనుకున్నా కుదరలేదు. మరి తారక్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పటికి వస్తుంది? అన్నది చూడాలి.