Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ప్రీ-రిలీజ్ ఏర్పాట్లు ముమ్మరం గెస్ట్ ఎవరంటే?

By:  Tupaki Desk   |   20 March 2021 5:50 PM IST
వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఏర్పాట్లు ముమ్మరం గెస్ట్ ఎవరంటే?
X
కరోనా వైరస్ మహమ్మారి వలన విధించిన లాక్డౌన్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న ఫస్ట్ సినిమా వకీల్ సాబ్. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా తాజాగా ముమ్మరం చేశారు మేకర్స్. వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రొడ్యూసర్ దిల్ రాజు.. అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో దూకుడుగా ప్రచారం చేయడానికి ఒక యంగ్ టీమ్ సెట్ చేసాడట. డైరెక్టర్ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ప్రచార కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పర్యవేక్షిస్తున్నాడు. ఈసారి వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ వేడుకలు ఘనంగా ప్లాన్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 3న యూసుఫ్ గూడ ప్రాంతంలోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ-రిలీజ్ వేడుకలు జరగనున్నాయి.

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇద్దరూ ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ అవాస్తవమని తెలుస్తుంది. ఈ వకీల్ సాబ్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి ఎవరూ ఉండరు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే రాబోతున్నాడని సమాచారం. అదేవిధంగా వకీల్ సాబ్ ట్రైలర్ మార్చి 29న విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ థియేట్రికల్ అండ్ నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడైపోయాయని ఇండస్ట్రీ టాక్.