Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ వరల్డ్‌ ప్రీమియర్ తేదీ ఖరారు

By:  Tupaki Desk   |   11 July 2021 3:00 PM IST
వకీల్‌ సాబ్‌ వరల్డ్‌ ప్రీమియర్ తేదీ ఖరారు
X
బాలీవుడ్ సూపర్‌ హిట్ మూవీ 'పింక్‌' ను తెలుగులో వకీల్‌ సాబ్ గా పవన్‌ కళ్యాణ్‌ మరియు వేణు శ్రీరామ్‌ లు రీమేక్ చేసిన విషయం తెల్సిందే. పింక్‌ కు కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించి సక్సెస్‌ దక్కించుకున్నారు. వకీల్‌ సాబ్‌ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కాని లాంగ్ రన్‌ లో నిలువలేక పోయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా రెండు వారాల లోపులోనే థియేటర్ల నుండి వెళ్లి పోయిన వకీల్‌ సాబ్‌ వెంటనే అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమెజాన్‌ లో కూడా భారీగానే వకీల్‌ సాబ్‌ ను చూశారు. అయినా కూడా బుల్లి తెరపై టెలికాస్ట్‌ ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ అభిమానులు మరియు మహిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు వకీల్‌ సాబ్‌ వరల్డ్‌ ప్రీమియర్‌ కు సిద్దం అయ్యింది. జులై 18వ తారీకున ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్‌ మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. జీ తెలుగు వారు ఈ సినిమా ను భారీ మొత్తంకు దిల్ రాజు నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వారు సినిమా ప్రమోషన్‌ ను మొదలు పెట్టారు. వరల్డ్ ప్రీమియర్‌ తేదీని నేడు అర్థరాత్రి సమయంలో అధికారికంగా ప్రకటించారు. సోషల్‌ మీడియాతో పాటు ఇతర వేదికలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆదివారం భారీ రేటింగ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈమద్య కాలంలో జీ తెలుగులో బడా సినిమాలు టెలికాస్ట్‌ అవుతున్నాయి. కనుక ఈ సినిమా వాటి జాబితాలో జాయిన్‌ అవ్వబోతుంది. పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు పవన్‌ క్రేజ్‌ యాడ్‌ అవ్వడం.. మహిళా పాయింట్‌ అవ్వడం కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను టీవీల ముందు కట్టి పడేసే అవకాశం ఉంటుందని జీ తెలుగు వారు భావిస్తున్నారు.

ఈ మద్య కాలంలో టెలికాస్ట్‌ అయిన సినిమాలన్నింటితో పోల్చితే వకీల్‌ సాబ్‌ సినిమాకు భారీ రేటింగ్‌ ఖాయంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. పవన్‌ కు జోడీగా శృతి హాసన్‌ నటించగా కీలక పాత్రల్లో అంజలి.. నివేథ థామస్‌.. అనన్య నాగళ్ల లు నటించారు. ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బుల్లి తెరపై అభిమానుల ప్రశంసలు దక్కించుకుంటుందేమో చూడాలి.