Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' వీకెండ్ కలెక్షన్స్ భారీగా పడిపోయాయా..?

By:  Tupaki Desk   |   14 April 2021 8:00 AM IST
వకీల్ సాబ్ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పడిపోయాయా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 65 శాతం వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ కలెక్షన్స్ లో సత్తా చాటుతుందనుకున్న 'వకీల్ సాబ్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారాంతంలో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పడిపోయాయని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదని తెలుస్తోంది. సోమవారం కూడా వైజాగ్ మినహా అన్ని ప్రధాన నగరాలలో ఈ కరోనా ప్రభావం కనిపించింది. అయితే ఈరోజు ఉగాది హోలిడే కావడంతో కలెక్షన్లలో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అలానే రేపు అంబేద్కర్ జయంతి సెలవు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా దాదాపు 25 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితుల్లో ఇది కష్టమే అనుకోవాలి.

కాకపోతే 'లవ్ స్టోరీ' 'టక్ జగదీష్' వంటి సినిమాలు వాయిదా పడటంతో మరో రెండు వారాలు 'వకీల్ సాబ్' థియేటర్లలో ఉంటుంది. పోటీ ఏమీ ఉండదు కాబట్టి కొంచెం నెమ్మదిగా అయినా అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత ఇలానే ఉంటే 50 శాతం ఆక్యుపెన్సీకి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' ఎంత వరకు వసూలు చేయగలుగుతాడో చూడాలి.