Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామాగా 'వకీల్ సాబ్'

By:  Tupaki Desk   |   29 March 2021 6:30 PM IST
ట్రైలర్ టాక్: మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామాగా వకీల్ సాబ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వకీల్ సాబ్''. హిందీలో సూప‌ర్ హిట్ అయిన 'పింక్' రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ - బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా శృతి హాస‌న్ న‌టించ‌గా.. అంజలి - నివేద థామస్ - అనన్య నాగెళ్ల కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న మేకర్స్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో గ్యాప్ లేకుండా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పీకే ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూసున్న 'వకీల్ సాబ్' థియేట్రికల్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

'మిస్ పల్లవి.. మీరు వర్జినేనా?' అని బోనులో ఉన్న నివేద థామస్ ను లాయర్ పాత్రధారి ప్రకాష్ రాజ్ ప్రశ్నించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. స్నేహితులని నమ్మిన కొందరు అబ్బాయిల చేతిలో మోసపోయి లైంగిక దాడికి గురైన ముగ్గురు యువతుల కథే ఇదని తెలుస్తోంది. ఎలాంటి సపోర్ట్ లేని ముగ్గురు అమ్మాయిల తరపున వాదించే వకీల్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు దీనిని కమర్షియల్ సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్.. ట్రైలర్ తో ఇందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఉందని తెలియజేస్తున్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామా అయినప్పటికీ.. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సోల్ మిస్సవ్వకుండా భారీ మార్పులు చేసినట్లు అర్థం అవుతుంది.

లాయర్ పాత్రలో పవన్ మ్యానరిజమ్.. అతను చెప్పే డైలాగ్స్.. చేసే ఫైట్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంజలి - నివేద థామస్ - అనన్య మంచి నటన కనబరిచినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'నువ్వు వర్జినేనా?' అని బోనులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించడం.. ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా 'మీరైతే అమ్మాయిలని అడగొచ్చు.. నేను అబ్బాయిలను అడగకూడదా? ఏమి న్యాయం నందాజీ' అని పవన్ చెప్పే డైలాగ్ అలరిస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అలానే సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ విజువల్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వరించారు. ఈ సినిమాకి తిరు డైలాగ్స్ రాశారు. ట్రైలర్ తో అంచనాలను పెంచిన 'వకీల్ సాబ్' ప్రజా కోర్టులో వచ్చే నెల 9న ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.