Begin typing your search above and press return to search.

జ‌స్ట్‌ సింగిల్ డే ఎవ‌రెస్టుపై 'వ‌కీల్ సాబ్‌'!

By:  Tupaki Desk   |   30 March 2021 9:00 PM IST
జ‌స్ట్‌ సింగిల్ డే ఎవ‌రెస్టుపై వ‌కీల్ సాబ్‌!
X
''ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ-ఎంట్రీమూవీ.. మూడేళ్ల త‌ర్వాత సినిమా వస్తోంది. మ‌రి, ఆ జోష్ ఏదీ? ఆ ఎన‌ర్జీ ఏదీ?'' అంటూ ఫ్యాన్స్ తెగ ఆవేద‌న ప‌డిపోయారు. నిర్మాతపైనా గుర్రుగానే ఉన్నారు. ‘‘పవన్ తో సినిమా తీయాలన్నదే లక్ష్యం అని పలుమార్లు ప్రకటించిన దిల్ రాజేనా.. ఇలా సైలెంట్ గా ఉన్న‌ది?'' అని కోపం కూడా ప్రదర్శించారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఇచ్చిన చిన్న‌పాటి అప్డేట్స్ త‌ప్ప‌, అస‌లు సినిమా ప్ర‌మోష‌నే లేదంటూ బాధ‌ప‌డిపోయారు. ఈ విష‌యం దిల్ రాజు వ‌ర‌కూ చేర‌డంతో.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారనే వార్త‌లు కూడా వ‌చ్చాయి. కొవిడ్ నేప‌థ్యంలో అది వాయిదా ప‌డుతోంద‌ని కూడా న్యూస్ వ‌చ్చింది.

ఇలాంటి స‌మయంలో దూసుకొచ్చిన వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్.. ప‌రిస్థితి మొత్తం మార్చిప‌డేసింది. ప‌వ‌ర్ స్టార్‌ మేనియాను.. ఒక్క‌సారిగా నేల నుంచి నింగిలోకి తారాజువ్వ‌లా తీసుకెళ్లింది. యూట్యూబ్ లో ట్రైల‌ర్‌ రిలీజ్ అయిన మ‌రు క్ష‌ణం నుంచే మొద‌లైన వ‌కీల్ సాబ్ దండ‌యాత్ర‌.. రికార్డుల విధ్వంసం కొన‌సాగిస్తూ దూసుకెల్తోంది.

అయితే.. ఇందులో దిల్ రాజు మాస్ట‌ర్ ప్లాన్ కూడా ఉంది. ఈ ట్రైల‌ర్ ను ఏకంగా థియేట‌ర్లో రిలీజ్ చేశారు నిర్మాత‌. హైద‌రాబాద్ లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్ కు.. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణుతో క‌లిసి వెళ్లిన దిల్ రాజు అట్ట‌హాసంగా అభిమానుల స‌మ‌క్షంలో ట్రైల‌ర్ వ‌దిలారు.

థియేట‌ర్ లో ఈ ట్రైల‌ర్ ను ఫ్యాన్స్ కు ఫ్రీగా చూపించారు. దీంతో.. అభిమానులు భారీగా వ‌చ్చేశారు. ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ విధంగా.. సినిమా క్రేజ్ ను సింగిల్ డేలో ఎవ‌రెస్టుపైకి తీసుకెళ్లార‌ని, నిర్మాత‌గా దిల్ రాజు మార్కును చూపించార‌ని అంటున్నారు.