Begin typing your search above and press return to search.

వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తోంది డేట్ ఫిక్స్‌!

By:  Tupaki Desk   |   24 March 2021 5:42 PM IST
వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తోంది డేట్ ఫిక్స్‌!
X
ప‌వ‌ర్ స్టార్ మేనియా ఫ్యాన్స్ ను ఊపేయ‌బోతోంది. వ‌కీల్ సాబ్ మూవీ రిలీజ్ డేట్‌ దగ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచింది యూనిట్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ మోస్త‌రుగా సాగిన ప్ర‌చారం.. ఇక పీక్ స్టేజ్ కు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తోంది వ‌కీల్ సాబ్ బృందం.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి మూడు పాట‌లు రిలీజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. 'మ‌గువా మ‌గువా' సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక‌, ఆ మ‌ధ్య వ‌దిలిన‌ టీజ‌ర్ సైతం అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్య‌డు శ్రీరామ్ వేణు. గ్రాండ్ గా టీజ‌ర్ ను లాంఛ్ చేయ‌డానికి ప్లాన్ చేసిన ద‌ర్శ‌కుడు.. ఇందుకు ముహూర్తంగా మార్చి 29వ తేదీ‌ని నిర్ణ‌యించారు.

మ‌రోవైపు.. నిర్మాత దిల్ రాజు బ‌య‌టి ప్ర‌చారాన్ని స్పీడ‌ప్ చేశారు. వ‌కీల్ సాబ్ ప్ర‌మోష‌న్ ఎవ‌రెస్టును తాకాలంటే.. ఖ‌చ్చితంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించాల్సిందేన‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేసి బంబాట్ గా వేడుక నిర్వ‌హించేందుకు స్కెచ్ గీస్తున్నారట‌.

అంతేకాదు.. ఈ ఈవెంట్ కు మెగా‌స్టార్ చిరంజీవితోపాటు రామ్ చ‌ర‌ణ్ కూడా రాబోతున్నార‌ని తెలుస్తోంది. వ‌కీల్ సాబ్ వేదిక‌పై చిరు, ప‌వ‌న్‌, చెర్రీ క‌నిపిస్తే.. ప్ర‌మోష‌న్‌ ఆకాశాన్ని తాక‌డం ఖాయ‌మ‌ని లెక్క‌లు వేస్తున్నార‌ట నిర్మాత‌. ఏప్రిల్ 9వ తేదీ నుంచి థియేట‌ర్లలో వ‌కీల్ సాబ్ సంద‌డి మొద‌లు కానున్న నేప‌థ్యంలో.. ఏప్రిల్ మొద‌టి వారంలోనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.