Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియాలో 'వకీల్‌ సాబ్‌' టికెట్‌ హెల్ప్‌ ట్రెండ్డింగ్‌

By:  Tupaki Desk   |   8 April 2021 5:39 AM GMT
సోషల్‌ మీడియాలో వకీల్‌ సాబ్‌ టికెట్‌ హెల్ప్‌ ట్రెండ్డింగ్‌
X
పవన్‌ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతి ఒక్క హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవ్వకుండా ఉండదు అనడంలో సందేహం లేదు. వకీల్‌ సాబ్‌ గురంచి పదుల కొద్ది హ్యాష్‌ ట్యాగ్‌ లు ట్రెండ్‌ అయ్యాయి. సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కొత్త తరహా ట్రెండ్‌ నడుస్తోంది. #VakeelSaabTicketsHelp అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో పవన్‌ అభిమానులు నెట్టింట హడావుడి చేస్తున్నారు. ఎవరి వద్దనైనా ఎక్కువ టికెట్లు ఉన్నా లేదంటే ఎవరికైనా టికెట్లు కావాలన్నా కూడా ఈ హ్యాష్ ట్యాగ్‌ తో షేర్‌ చేయడం చేస్తున్నారు.

ఈ హ్యాష్‌ ట్యాగ్‌ తో టికెట్లను పంచుకోవడం టికెట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వంటివి జరుగుతున్నాయి. టాలీవుడ్‌ లోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి సారి ఇలా జరుగుతుందని పవన్ అభిమానులు అంటున్నారు. ఇండియా వైడ్‌ గా ఈ హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్‌ అవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. వకీల్‌ సాబ్‌ సినిమా క్రేజ్‌ నేపథ్యంలో ఎంతో మంది మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఆశ పడుతున్నారు. కాని టికెట్లు లేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు టికెట్లు ఎక్కువ తీసుకుని పెట్టుకోవడం వల్ల కూడా ఆ సమస్య మరింతగా ఉంటుంది. ఎక్కువ తీసుకున్న వారు తమ వద్ద వృదా కాకుండా ఫ్రీగా లేదంటే డబ్బులకు ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతుంది. మొత్తానికి వకీల్‌ సాబ్‌ ఎన్నో కొత్త ట్రెండ్‌ లను సృష్టించింది. ఇక మీదట స్టార్‌ హీరోల సినిమాలకు ఇలా టికెట్స్‌ హెల్ప్‌ సోషల్‌ మీడియా ట్రెండ్డింగ్‌ ఖచ్చితంగా నడిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.