Begin typing your search above and press return to search.

‘వ‌కీల్ సాబ్’ సక్సెస్.. అమితానందంలో సీత‌!

By:  Tupaki Desk   |   11 April 2021 9:30 AM GMT
‘వ‌కీల్ సాబ్’ సక్సెస్.. అమితానందంలో సీత‌!
X
‘వ‌కీల్ సాబ్’ చిత్రానికి అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన లభిస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రముఖంగా చర్చించిన ఈ సినిమాను అంద‌రూ అభినందిస్తున్నారు. ఈ టాక్ తో చిత్ర‌బృందం సంతోషంగా ఉంది. ఈ సినిమా ముగ్గురు యువ‌తుల చుట్టూ తిరుగుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక‌రిగా ఉన్నారు న‌టి అంజ‌లి.

తెలుగు ఇండ‌స్ట్రీకి అంజలి ప‌రిచ‌య‌మై పుష్క‌ర కాలం దాటింది. హీరోయిన్ మొద‌లు ఐట‌మ్ గ‌ర్ల్ దాకా.. అన్నిత‌ర‌హా పాత్ర‌ల్లోనూ న‌టించిన అంజ‌లి.. కొద్దికాలంగా స‌రైన స‌క్సెస్ లేక‌ వెనక‌బ‌డింది. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ సినిమాలో సీత పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఆ పాత్ర అంజ‌లికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.కానీ.. ఆ త‌ర్వాత అన్నీ ప‌రాజ‌యాలే ఎదుర‌య్యాయి.

దీంతో.. వ‌కీల్ సాబ్ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుందీ బ్యూటీ. ఈ సినిమాతోనే బ్యాక్ బౌన్స్ అవ్వాల‌ని భావించింది. అనుకున్న‌ట్టుగానే సినిమా స‌క్సెస్ కావ‌డంతో అంజ‌లి ఆనందంగా ఉంద‌ట‌. ఈ సినిమాతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన బ్యూటీ.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావిస్తోంద‌ట‌. మ‌రి, అంజ‌లిని ఎలాంటి ఆఫ‌ర్లు వ‌రిస్తాయో చూడాలి.