Begin typing your search above and press return to search.

వకీల్ సాబ్ కు లీకేజీ ప్రాబ్లం.. తాజాగా మరొకటి..

By:  Tupaki Desk   |   17 Dec 2020 2:00 PM IST
వకీల్ సాబ్ కు లీకేజీ ప్రాబ్లం.. తాజాగా మరొకటి..
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ‘ఆయనకు అభిమానులు ఉండరు.. భక్తులు మాాత్రమే ఉంటార’ని అంటుంటారు. అంతలా ఆరాధిస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. పవన్ సీరియస్ పొలిటీషియన్ గా మారిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అభిమానులను అలరించక దాదాపు మూడేళ్లైంది. ఇంత గ్యాప్ తరువాత పవన్ నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” రీమేక్ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

లీకుల బెడద..
అయితే.. వకీల్ సాబ్ కు లీకుల బెడద తప్పట్లేదు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రాలు లీకవుతూనే ఉన్నాయి. పవన్ కు సంబంధించిన ఆన్ లొకేషన్ ఇమేజెస్.. బయటకు వచ్చేసి శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత మొదలైన షూట్ కు సంబంధించిన ఫొటోలు కూడా తాజాగా లీకయ్యాయి.

షేర్ చేస్తున్న అభిమానులు..
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా వాటిని పవన్ అభిమానులే చాలా మంది జోరుగా షేర్ చేసుకుంటూ ఉండడం గమనార్హం. మరి, ఆన్ లోకేషన్ నుంచి ఫొటోలు లీకవుతుంటే.. మూవీ మేకర్స్ ఏం చేస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సార్లు ఫొటోలు, వీడియోలు లీకవుతున్నా.. వారు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో వారికే తెలియాలని అంటున్నారు.