Begin typing your search above and press return to search.

నెల్లూరు కుర్రాళ్లా మజాకా.. 'వకీల్ సాబ్' రీక్రియేషన్ అదరగొట్టేసారుగా!

By:  Tupaki Desk   |   24 May 2021 8:00 PM IST
నెల్లూరు కుర్రాళ్లా మజాకా.. వకీల్ సాబ్ రీక్రియేషన్ అదరగొట్టేసారుగా!
X
ఈ మధ్యకాలంలో సినిమాలు చూసి ఏదైనా సీన్ బాగా నచ్చితే దాన్ని లోకల్ గ్యాంగ్ తో రీక్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తున్నారు టాలెంటెడ్ కుర్రాళ్లు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాలోని ప్రీ-క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒరిజినల్ కు ఏమాత్రం తీసిపోకుండా పిల్లలు గ్యాంగ్ కలిసి రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెల్లూరుకు చెందిన ఆ కుర్రాళ్లు వకీల్ సాబ్ ఇంటర్వెల్ బాత్రూం ఫైట్ తో పాటు ప్రీ క్లైమాక్స్ మెట్రో ఫైట్ సీన్ మిక్స్ చేసి కంపోజ్ చేశారు. అసలు ఆ వీడియో మేకింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే తమన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కు ఫైట్స్ - షాట్స్ - స్టైల్ తో సింక్ చేస్తూ కుర్రాళ్ళు అదరగొట్టారు. ప్రస్తుతం వారి వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

మరి ఓ విలేజ్ లోని ఓ ఇంట్లో సీన్ ప్లాన్ చేసి హీరో వకీల్ సాబ్ ముగ్గురు ఆడపిల్లలను కాపాడి బయటికి తీసుకొచ్చేలా అదిరిపోయే డిజైన్ చేసారని చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మరి ఆ వీడియో చూస్తే ఎవరైనా ఆ కుర్రాళ్ళను మెచ్చుకోక మానరు. అసలు టెక్నికల్ స్కిల్స్ చూస్తే దిమ్మతిరిగి పోతుంది. ఎందుకంటే ఆ సన్నివేశానికి స్లో మోషన్ యాడ్ చేసి మరీ ఎడిటింగ్ చేశారు. ఇలాంటి గ్రేట్ టాలెంట్ విలేజ్ లెవెల్లో నుండి ప్రపంచానికి పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉందంటూ పలువురు వీడియో చూసిన ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా స్పందించి ఆ కుర్రాళ్ల గురించి ఆరా తీయడం విశేషం.

ప్రస్తుతం ఆ వకీల్ సాబ్ రీక్రియేటెడ్ వీడియో ఓ రేంజిలో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆ వీడియోలో వకీల్ సాబ్ గా నటించిన కుర్రాడు - ఆ దెబ్బలు తిన్నటువంటి కుర్రాళ్లు - ఆడపిల్లలు అందరూ అదరగొట్టారనే చెప్పాలి. ఈ వీడియో ఎలాగో మొత్తానికి వకీల్ సాబ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వద్దకు చేరింది. వీడియో చూసిన తమన్ తమ రెస్పాన్స్ ట్విట్టర్ లో పెట్టాడు. 'వీడియో చూసాక అసలు నమ్మలేకపోయాను. ఈ కుర్రాళ్లు మొత్తం ఇరగదిశారు. ఆ మ్యూజిక్ కు షాట్స్ సింకింగ్ చూస్తే మతిపోతుంది. వావ్ క్రేజీ' అంటూ ట్వీట్ చేసాడు. అలాగే డైరెక్టర్ సాయిరాజేష్ కూడా వీడియో పై స్పందించి.. 'ఆ కుర్రాళ్ల ప్రతిభ అదిరిపోయింది. ఎవరైనా వారి డీటెయిల్స్ ఉంటే మెసేజ్ చేయండి' అని ట్వీట్ చేయడం మరో విశేషం. చూడాలి మరి ఈ కుర్రాళ్లు ఎలాంటి అప్లోజ్ అందుకుంటారో..!