Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' మొదలెట్టేశారు..!

By:  Tupaki Desk   |   19 March 2021 7:11 PM IST
వకీల్ సాబ్ మొదలెట్టేశారు..!
X
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ''వ‌కీల్ సాబ్'' చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. హిందీలో సూప‌ర్ హిట్ అయిన 'పింక్' రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ - బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. అంజలి - నివేద థామస్ - అనన్య నాగెళ్ల కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో భారీ ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

అలానే 'వకీల్ సాబ్' కు తగినంత పబ్లిసిటీ చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ.. చిత్ర యూనిట్ ఎలక్ట్రానిక్ మీడియా - ప్రింట్ మీడియాల ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఎలక్ట్రానిక్ మీడియా కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ - లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి లతో ఓ ఇంటర్వ్యూ చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 3న యూసఫ్ గూడ‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌గా.. దీని కోసం దాదాపు కోటి వరకు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పవన్ చాలా గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న మూవీ కావడంతో భారీగా 'వకీల్ సాబ్' ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది.