Begin typing your search above and press return to search.

రేపు 'వకీల్ సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్.. పాసులు లేకపోతే నో ఎంట్రీ..!

By:  Tupaki Desk   |   3 April 2021 4:30 PM GMT
రేపు వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. పాసులు లేకపోతే నో ఎంట్రీ..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత చేసిన చిత్రం ''వకీల్‌ సాబ్‌''. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇటీవల విడుదల ట్రైలర్‌ విశేష స్పందన తెచ్చుకుని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలో అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. రేపు ఆదివారం (ఏప్రిల్ 3) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

కోవిడ్ గైడ్ లైన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొద్దిమందిని మాత్రమే 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానిస్తున్నామని.. పాస్ లు ఉన్నవారు మాత్రమే రావాలని ఫ్యాన్స్ ని మేకర్స్ రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చెప్పులు లేకుండా స్టైలిష్ గా నిలబడిన పవన్ కళ్యాణ్ పోస్టర్ ఒకటి వదిలారు. ఇకపోతే ఈరోజు తిరుపతిలో పొలిటికల్ కార్యక్రమానికి హాజరైన పవన్ రేపు ఈ వేడుకకు అటెండ్ అవుతారని తెలుస్తోంది. వాస్తవానికి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో శిల్పకళా వేదికలో చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు

కాగా, 'పింక్' చిత్రానికి రీమేక్ గా శ్రీరామ్ వేణు 'వకీల్ సాబ్' ను తెరకెక్కించాడు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ఇందులో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటించింది. అంజలి - నివేదా థామస్ - అనన్య - ప్రకాశ్ రాజ్ లు కీలక పాత్రలు పోషించారు.