Begin typing your search above and press return to search.
టీవీ ఛానల్ లో వకీల్ సాబ్.. రిలీజ్‌రోజే ప్రసారం!
By: Tupaki Desk | 14 April 2021 8:00 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'వకీల్ సాబ్'. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. భారీస్థాయి కలెక్షన్లు కొల్లగొడుతూ వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. మహిళల సమస్యలపై చర్చించిన సినిమా కావడంతో అన్ని వర్గాల నుంచీ మంచి ఆదరణ లభిస్తోందని అంటున్నారు.
అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సినిమా పైరసీ ఇండస్ట్రీని ఏ స్థాయిలో పట్టి పీడిస్తోందో అందరికీ తెలిసిందే. గతంలో సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత సీడీల రూపంలో పైరసీ నడిచేది. కానీ.. ఇప్పుడు పొద్దున సినిమా విడుదలైతే.. సాయంత్రం కల్లా ఆన్ లైన్లో పెట్టేస్తున్నాయి కొన్ని సైట్లు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. పైరసీని అడ్డుకోవడం సాధ్యం కావట్లేదు.
అయితే.. తాజాగా ఈ సినిమాను ఓ కేబుల్ టీవీలో ప్రసారం చేయడం కలకలం రేగింది. ఏపీలోని విజయనగరంలో ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం కేబుల్ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. నిర్మాత దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సదరు కేబుల్ టీవీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మరి, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.