Begin typing your search above and press return to search.

'యూఎస్ ప్రీమియర్స్'లో వకీల్ సాబ్ నెంబర్ 1 కలెక్షన్స్!

By:  Tupaki Desk   |   9 April 2021 1:12 PM GMT
యూఎస్ ప్రీమియర్స్లో వకీల్ సాబ్ నెంబర్ 1 కలెక్షన్స్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్'. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిజంగానే భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా వకీల్ సాబ్ యూఎస్ ప్రీమియర్ షోలకు సంబంధించిన కలెక్షన్స్ న్యూస్ బయటికి వచ్చింది. సినీవర్గాల సమాచారం మేరకు.. వకీల్ సాబ్ యూఎస్ ప్రీమియర్ షోలు 296కే డాలర్స్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది యూఎస్ లో ప్రీమియర్స్ వేసిన టాలీవుడ్ సినిమాలలో వకీల్ సాబ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. యూఎస్ లో థియేటర్స్ రెస్ట్రిక్షన్స్ లో ఉన్నప్పటికీ వకీల్ సాబ్ 226 సెంటర్స్ నుండి 2,96,885 డాలర్స్ వసూల్ చేయడం రికార్డు అనే చెప్పాలి. అలాగే వకీల్ సాబ్ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కాబట్టి వారాంతంలో సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే వకీల్ సాబ్ సినిమా యూఎస్ ప్రేక్షకులకు కొత్తకాదు. ఎందుకంటే ఇదివరకే అమితాబ్ బచ్చన్ నటించిన ఒరిజినల్ పింక్ మూవీ చూసేసారు. అయినా సరే వకీల్ సాబ్ దాదాపుగా 300కే డాలర్స్ వసూల్ చేయడం అనేది విశేషమే. అయితే ఇటీవలే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్న జాతిరత్నాలు సినిమా ప్రీమియర్ షోలతో 132కే డాలర్స్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కించగా.. దిల్ రాజు సినిమాను నిర్మించాడు. ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలకపాత్రలు పోషించిన వకీల్ సాబ్ మూవీని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లినట్లు టాక్. చూడాలి మరి వారాంతంలో వకీల్ సాబ్ యూఎస్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో!