Begin typing your search above and press return to search.

పవన్‌ యాక్షన్‌ తో తుది ఘటం పునః ప్రారంభం

By:  Tupaki Desk   |   16 Dec 2020 12:21 PM IST
పవన్‌ యాక్షన్‌ తో తుది ఘటం పునః ప్రారంభం
X
పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ అదుగో ఇదుగో అన్నట్లుగా అవుతుంది. సంక్రాంతికి విడుదల చేయడం కోసం నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో షూటింగ్ ను పూర్తి చేయాలని భావించారు. కాని సంక్రాంతికి విడుదల లేక పోవడంతో మెల్లగానే సినిమా షూటింగ్‌ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఆమద్య ఆపేశారు. మళ్లీ పవన్‌ ఈ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు పవన్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో పవన్‌ పాల్గొంటున్నాడట.

యాక్షన్‌ సీన్స్‌ తర్వాత వచ్చే నెల ఆరంభంలోనే శృతి హాసన్‌ కాంబోలో పవన్‌ సీన్స్‌ చేయబోతున్నాడు. రెండు వారాల పాటు శృతి హాసన్ సినిమాలో నటించబోతుంది. గెస్ట్ అప్పియరెన్స్‌ గా మాత్రమే ఆమె కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ పూర్తి అయిన తర్వాత శృతి హాసన్‌ పవన్‌ కళ్యాణ్‌ ల కాంబోలో కొన్ని టాకీ సీన్స్‌ ఇంకా ఒక పాటను కూడా చిత్రీకరించడంతో మొత్తం షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జనవరి లో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందంటున్నారు.