Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసు నుంచి 'వకీల్ సాబ్' తప్పుకుంటున్నాడా..?

By:  Tupaki Desk   |   3 Dec 2020 12:30 PM IST
సంక్రాంతి రేసు నుంచి వకీల్ సాబ్ తప్పుకుంటున్నాడా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత వెండితెరపై కనిపించనున్న సినిమా ''వకీల్ సాబ్''. 'పింక్‌' చిత్రానికి రీమేక్‌ గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ లాయర్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్' కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొని కాస్త విరామం ప్రకటించాడు. అయితే 'వకీల్ సాబ్' షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఇంకా విడుదలపై స్పష్టత రావడంలేదు.

'వ‌కీల్ సాబ్' చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కరోనా మహమ్మారి వచ్చి షూటింగ్ కి బ్రేక్స్ వేయడంతో ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుస్తుండటంతో 'వకీల్ సాబ్' ని సంక్రాంతి బరిలో నిలపనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది. ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారో లేదో అనే అనుమానంతో పెద్ద సినిమాలను ప్రొడ్యూసర్స్ చెప్పిన రేట్ కి తీసుకోడానికి ముందుకు రావడం లేదట. ఇప్పటికే అనేక అవాంతరాలతో ఆలస్యం అవుతూ వస్తున్న 'వకీల్ సాబ్' విడుదల మళ్లీ వాయిదా పడుతుందనే వార్తలు వస్తుండటంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఒకవేళ ఈ చిత్రం సంక్రాంతి పోరు నుంచి తప్పుకుంటే ఉగాదికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా వకీల్ సాబ్ ఎప్పుడు కోర్టులో అడుగుపెడతాడో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.