Begin typing your search above and press return to search.
స్టార్ హీరోకు అభిమానుల టెన్సన్.. నిర్మాతకు స్టార్ హీరో టెన్షన్స్
By: Tupaki Desk | 16 Oct 2020 12:45 PM ISTచాలా గ్యాప్ తర్వాత తమ ఫేవరెట్ హీరో నుంచి ఓ సినిమా వస్తోంది అంటే.. దానికోసం అభిమానులు ఆత్రపడడం సహజమే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు.
ఒకదాని వెంట ఒకటిగా ఐదు సినిమాలు చేస్తున్నా.. ఇంకా ఏదీ రాదేం? అన్న టెన్షన్ అభిమానులకు ఉంది. దీంతో పవన్ పై టెన్షన్స్ కూడా ఆ రేంజులోనే ఉన్నాయి మరి. దీంతో నిర్మాత దిల్ రాజును పిలిచి ఒకటే మాట చెప్పారట. ఎట్టి పరిస్థితిలో సినిమాని వేగంగా పూర్తి చేయాలి. సేమ్ టైమ్ అభిమానులకు ఆన్సరబుల్ గా ఉండేలా ప్రమోషన్ చేయాలని సూచించారట. అంటే ఇకపై వరుసగా వకీల్ సాబ్ కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోల్ని రిలీజ్ చేయాలన్నది ఆయన ఆజ్ఞ.
అంతేకాదు.. తన అభిమానుల్ని పవన్ కాస్త వేచి చూడాల్సిందిగా కోరారట. వకీల్ సాబ్ పోస్టర్లు.. టీజర్ వచ్చేస్తున్నాయి కొంత ఓపిక అవసరం అని సూచించారట. ఇకపై వరుసగా ఫీలర్స్ వదులుతారని సమాచారం. వకీల్ సాబ్ లో తన పార్ట్ ని పవన్ దసరా నాటికి పూర్తి చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.