Begin typing your search above and press return to search.
గుమ్మడికాయ కొట్టడంతో వకీల్ సాబ్ సంక్రాంతి ట్రీట్ కన్ఫర్మ్
By: Tupaki Desk | 30 Dec 2020 1:17 PM ISTపవన్ కళ్యాణ్ ఎట్టకేలకు వకీల్ సాబ్ కు గుమ్మడి కాయ కొట్టేశాడు. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించినా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. అజ్ఞాత వాసి వచ్చి మూడు సంవత్సరాలు అవ్వబోతుంది. ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో వకీల్ సాబ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకు సంబంధించిన టీజర్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో సంక్రాంతికి వకీల్ సాబ్ ట్రీట్ ఉంటుందనే నమ్మకంతో పవన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని మొదట భావించినా కూడా థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిచే వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారట.
ఫిబ్రవరి లేదా మార్చి నుండి థియేటర్లపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేసే అవకాశం ఉంది. ఆంక్షలు ఎత్తివేయడమే ఆలస్యం వెంటనే థియేటర్లలో వకీల్ సాబ్ దిగబోతున్నాడు. అందుకే ఇప్పటి నుండే జనాల్లో వకీల్ సాబ్ ను సందడి చేయించాలనే ఉద్దేశ్యంతో సంక్రాంతికి సినిమా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా టీజర్ అప్ డేట్ ను దిల్ రాజు ఇచ్చే అవకాశం ఉంది.
అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ముగిసింది అంటూ కొత్త సంవత్సరం కానుకగా పవన్.. శృతి హాసన్ ల రొమాంటిక్ స్టిల్ ను కూడా విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. వకీల్ సాబ్ కు గుమ్మడి కాయ కొట్టిన పవన్ మరో వారం రోజుల్లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ లో రానాతో కలిసి పాల్గొనబోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఆ రీమేక్ రూపొందబోతున్న విషయం తెల్సిందే.