Begin typing your search above and press return to search.

ఆన్ లైన్లో పవన్, శృతి.. మళ్లీ లీకైన వకీల్ సాబ్ ఫొటో..

By:  Tupaki Desk   |   21 Dec 2020 11:00 AM IST
ఆన్ లైన్లో పవన్, శృతి.. మళ్లీ లీకైన వకీల్ సాబ్ ఫొటో..
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రాన్ని లీకుల బెడద వదిలి పెట్టట్లేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సమాచారం బయటకు వెళ్లకుండా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఫొటోలు లీకవుతూనే ఉన్నాయి.

వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఫొటో ఒకటి ఇటీవల లీకై యూనిట్‌కి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అది మరువకముందే తాజాగా మరో ఫొటో లీకైంది. పవన్, శ్రుతిహాసన్ మధ్య ఓ పాట చిత్రీకరిస్తున్న సందర్భంగా క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో హీరో హీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపిస్తున్నారు.

ఈ సినిమా కోసం పవన్ అభిమానులతోపాటు, ఇతర ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మధ్యలో ఈ లీకేజీ సమస్య కొనసాగుతుండడంతో క్యూరియాసిటీపై ఎఫెక్ట్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, మేకర్స్ ఎలాంటి జాాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ న్యాయవాదిగా కనిపించనున్నారు. శృతిహాసన్‌. పవన్‌, శృతి కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం కావడం విశేషం.

హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి ఇది రీమేక్.
వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కాగా.. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవికి ప్లాన్ చేస్తున్నారు.