Begin typing your search above and press return to search.

అంజ‌లీ కెరీర్ కు 'వ‌కీల్ సాబ్' అండ‌..?

By:  Tupaki Desk   |   1 April 2021 6:01 PM IST
అంజ‌లీ కెరీర్ కు వ‌కీల్ సాబ్ అండ‌..?
X
పవర్ స్టార్ కమ్ బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' ఎన్నో విధాలుగా చర్చల్లో ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ టీజ‌ర్ టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డుల‌ను బ‌ద్ధ‌లు కొడుతూ దూసుకెళ్తోంది. ఈ నెవ్వ‌ర్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ చూస్తూ.. అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు.

ఇక, మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ సినిమా రాబోతుండ‌డంతో.. ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందోన‌ని అంద‌రూ డిస్క‌స్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో న్యాయం కోసం పోరాడే ముగ్గురు మ‌హిళ‌ల్లో ఒక‌రిగా న‌టించింది అంజ‌లి.

తెలుగులో హీరోయిన్ మొద‌లు ఐట‌మ్ గ‌ర్ల్ దాకా.. అన్నిత‌ర‌హా పాత్ర‌ల్లోనూ న‌టించిన అంజ‌లి.. కొద్దికాలంగా వెనుక‌బ‌డింది. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ చిత్రంలో నివేదా థామ‌స్, అంజ‌లి పోటీప‌డి న‌టించిన‌ట్టు స‌మాచారం.

పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న ఈచిత్రం ద్వారా.. అంజ‌లి కెరీర్ మ‌ళ్లీ పిక‌ప్ అందుకుంటుంద‌ని అంటున్నారు. ట్రైల‌ర్ ను బ‌ట్టి చూస్తే.. అంజ‌లి అభిన‌యం తార‌స్థాయిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి, అంజ‌లి కెరీర్ కు వ‌కీల్ సాబ్ ఏ మేర‌కు అండ‌గా నిలుస్తాడో చూడాలి.