Begin typing your search above and press return to search.

#వ‌కీల్ సాబ్‌: లోక‌ల్ ర‌న్నింగ్ ట్రైన్ లో రెస్ట్ రూమ్ లో ద‌బిడ దిబిడే

By:  Tupaki Desk   |   29 March 2021 11:00 PM IST
#వ‌కీల్ సాబ్‌: లోక‌ల్ ర‌న్నింగ్ ట్రైన్ లో రెస్ట్ రూమ్ లో ద‌బిడ దిబిడే
X
ర‌న్నింగ్ ట్రైయిన్ లో అదీ లోక‌ల్ మెట్రో ట్రెయిన్ లో ఉతికి ఉతికి ఆరేస్తాడు. అలాగే రెస్ట్ రూమ్ లో ప్ర‌త్య‌ర్థిని దొర‌క‌బుచ్చుకున్నాక‌ ద‌బిడ దిబిడే. ఆ త‌ర్వాత విశ్రాంతికి ముందు ఫైట్ ఊపిరాడ‌నివ్వ‌దు. ఆడియెన్ ని ఆ మూడు ఫైట్స్ థ్రిల్ చేస్తాయి.

అంతేనా.. సెకండాఫ్ లో ఫైట్స్ ఉండ‌వా? అంటే అక్క‌డా ఒక వీర‌లెవ‌ల్ పోరాట దృశ్యం.. వెర‌సి మొత్తం నాలుగు ఫైట్స్ తో వ‌కీల్ సాబ్ ఇర‌గ‌దీస్తాడట‌. దీనికి తోడు అత‌డికి శ్రుతితో ల‌వ్ ట్రాక్.. ఫ్లాష్ బ్యాక్ లోనే ల‌వ్ లీ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. ఇవ‌న్నీ ప‌వ‌న్ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని పింక్ క‌థ‌కు అద‌నంగా జోడించారు. అలా వ‌కీల్ సాబ్ అన్ని అంశాల మేలు క‌ల‌యిక‌తో జ‌న‌రంజ‌కంగా మారింద‌ట‌.

సుమారు మూడు గంట‌ల నిడివితో ఈ సినిమా థియేట‌ర్ల‌లో ట్రీటిస్తుంద‌న్న టాక్ వినిపిస్తోంది‌. లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబ‌ట్టి ఎమోష‌న‌ల్ గ్రాఫ్ అంత‌కంత‌కు స్కైని ట‌చ్ చేస్తుంద‌నేది ఇన్ సైడ్ సినిమా చూసిన వాళ్ల టాక్. స్త్రీల‌ సున్నితమైన సమస్యను చ‌ర్చించే ఆస‌క్తిక‌ర చిత్ర‌మిది. ఫ‌క్తు కోర్ట్ డ్రామా ర‌న్ అవుతూనే క‌మ‌ర్షియ‌ల్ ఎలివేష‌న్ ని చూపిస్తున్నారు.

ప‌వ‌న్ అభిమానులను మెప్పించడానికి చాలా హీరో ఎలివేషన్ దృశ్యాలు ఉంటాయి. సినిమా ప్రధాన కథాంశానికి భంగం కలిగించకుండా ఇందులో నాలుగు ఫైట్స్ ని ఎలా మిక్స్ చేసారు? ప‌వ‌న్ హీరోయిజం ఏ రేంజులో ఉండ‌బోతోంది? అన్న‌ది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద డిబేట్ గా మారింది. ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని పెద్ద లెవ‌ల్ కి తీసుకెళ్లేందుకు అసాధార‌ణ సాహ‌సాలే చేశార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. మ‌రి వ‌కీల్ సాబ్ కి జ‌నాద‌ర‌ణ ఎలా ఉంటుంది? అన్న‌ది థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాక క్రిటిక్స్ రివ్యూలు చ‌దివాక కానీ చెప్ప‌లేం.