Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ దీపావళి అప్ డేట్ పరిస్థితి ఏంటీ?
By: Tupaki Desk | 12 Nov 2020 1:00 PM ISTపవన్ కళ్యాణ్ 26వ సినిమా వకీల్ సాబ్ సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే ఖచ్చితంగా సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు బలంగా కోరుకుంటున్నాడట. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సమ్మర్ లో రావాల్సిన సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయి ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో షూటింగ్ ను ముగించేయబోతున్నారట. ఇప్పటికే షూటింగ్ జరిగిన పార్ట్ కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. కనుక విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని కనుక దీపావళికి ఖచ్చితంగా టీజర్ ను వదిలే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు.
దీపావళి కానుక కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం నోరు మెదపడటం లేదు. ప్రస్తుతం షూటింగ్ తో బిజీ బిజీగానే ఉన్నట్లుగా ఉన్నారు. దీపావళికి కనీసం పోస్టర్ కాని టీజర్ కాని వస్తుందా రావడం లేదా అంటూ ఫ్యాన్స్ నెట్టింట దర్శక నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. కాని ఎవరి నుండి స్పందన సమాధానం కనిపించడం లేదు. దీపావళి మరో రెండు రోజులు మాత్రమే ఉన్న కారణంగా ఏదైనా అప్ డేట్ వచ్చేది ఉంటే ఇప్పటికే ప్రకటన చేసేవారు. కాని ఇప్పటి వరకు దిల్ రాజు నుండి ఎలాంటి ప్రకటన లేదు కనుక దీపావళి అప్ డేట్ ఏమీ ఉండదేమో అనిపిస్తుంది.