Begin typing your search above and press return to search.

'యూట్యూబ్'లో ట్రెండ్ సృష్టిస్తున్న వకీల్ సాబ్!అనూహ్యంగా టాప్ లోకి..

By:  Tupaki Desk   |   15 Jan 2021 10:36 AM GMT
యూట్యూబ్లో ట్రెండ్ సృష్టిస్తున్న వకీల్ సాబ్!అనూహ్యంగా టాప్ లోకి..
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల సినీ విరామం రీఎంట్రీ ఇవ్వనున్న సినిమా 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మొదటిసారి పవర్ స్టార్ వకీల్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో రికార్డు వైపు కన్నేశారు అభిమానులు. రోజురోజుకి అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా విడుదల గురించి ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ నటించిన సూపర్ హిట్ పింక్ సినిమాకు ఆఫీసియల్ రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. శృతిహసన్ పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. రిలీజ్ ఎప్పుడని అంటున్నారు ఫ్యాన్స్. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా వకీల్ సాబ్ టీజర్ యూట్యూబ్ లో విడుదల చేసేసారు మేకర్స్.

ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ఈ టీజర్ ను లేపి ఎక్కడో పెట్టేసారు. ప్రస్తుతం వకీల్ సాబ్ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తోంది. వకీల్ సాబ్ టీజర్ విడుదల చేసేసరికి పవన్ కళ్యాణ్ అభిమానులలో ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఏకంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలలో ట్రెండ్ సృష్టించేందుకు హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. జనవరి 14న అంటే సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం 6:03 గంటలకు వకీల్ సాబ్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. విడుదల చేసిన కొద్దీ సమయంలోనే వకీల్ సాబ్ టీజర్ మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఈ రికార్డు అందుకున్న రెండో సినిమాగా వకీల్ నిలిచింది. మొదటిస్థానంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉంది. ఇప్పటికే ఎనిమిది మిలియన్ల పైగా వ్యూస్ పొందిన వకీల్ సాబ్ టీజర్.. ఏడు లక్షలకు పైగా లైక్స్ పొందింది. లైక్స్ లో కూడా వకీల్ టాప్ లో నిలిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వకీల్ సాబ్ పేరు ట్రెండింగ్ లో ఉంది. చూడాలి మరి రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో..!!