Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ మాస్క్‌ లు వచ్చేశాయి

By:  Tupaki Desk   |   6 May 2020 11:00 AM IST
వకీల్‌ సాబ్‌ మాస్క్‌ లు వచ్చేశాయి
X
కరోనా కారణంగా అన్ని వర్గాల వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పేదలు పని లేక ఒక్క పూట బోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చాలా కీలకమైన మాస్క్‌ లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. కొందరు మాస్క్‌ లను కొనుగోలు చేసేందుకు కనీస డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం తమవంతు సాయం అన్నట్లుగా దాతలు మాస్క్‌ లను పంచుతున్నారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల మాస్క్‌ లను దాతలు పంచి పెడుతున్నారు.

ఇలాంటి విపత్తు సమయంలో మెగా ఫ్యాన్స్‌ ముందు ఉంటారు. వారికి తోచిన సాయంను మెగా ఫ్యాన్స్‌ పేరుతో లేదా పవన్‌ ఫ్యాన్స్‌ పేరుతో చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌ పేదలకు కావాల్సిన కిరాణంతో పాటు మాస్క్‌ లు హ్యాండ్‌ శానిటైజర్స్‌ ను తెలుగు రాష్ట్రాల్లో పంచి పెడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ ప్రింట్‌ తో మాస్క్‌ లను కొందరు పంచి పెడుతున్నారు. కొన్ని మాస్క్‌ లపై చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ అని కూడా ఉంటున్నాయి.

మెగా ఫ్యాన్స్‌ ఈ సమయంలో మాస్క్‌ లను పంచి పెట్టడంను చాలా మంది అభినందిస్తున్నారు. అయితే మాస్క్‌ లపై ఇలా ప్రింట్‌ చేయడంను కొందరు తప్పుబడుతున్నారు. తాము ఇచ్చామంటూ పబ్లిసిటీ చేసుకోవాలా అంటున్నారు. ఏది ఏమైనా ఈ సమయంలో మాస్క్‌ లను పంచి పెట్టడం అనేది మంచి పనిగా చెప్పుకోవచ్చు. వాటిపై ప్రింట్‌ వేయడం పేర్లు పెట్టడం వారి విజ్ఞత అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.