Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ఒరిజిన‌ల్ కి పూర్తి ఆపోజిట్ లో!

By:  Tupaki Desk   |   2 March 2021 9:10 AM GMT
ట్రెండీ టాక్‌: ఒరిజిన‌ల్ కి పూర్తి ఆపోజిట్ లో!
X
బాలీవుడ్ లో `పింక్` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఒక బ‌ల‌మైన సామాజికాంశాన్ని స్ప‌ర్శిస్తూ కోర్టు డ్రామా నేప‌థ్యంలో ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ప‌ని లేకుండా ఎంతో ఎమోష‌న‌ల్ గా తెర‌కెక్కించి అక్క‌డ హిట్టు కొట్టారు. ఆ త‌ర్వాత ఇంచుమించు అలానే అజిత్ హీరోగా త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు. ఈ రెండు చోట్లా బోనీక‌పూర్ నిర్మాత‌గా కొన‌సాగారు.

ఇప్పుడు తెలుగు వెర్ష‌న్ ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిస్తున్నారు. వ‌కీల్ సాబ్ అనే టైటిల్ అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. బోనీక‌పూర్ స్వ‌యంగా దిల్ రాజుతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ఆదిత్య శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది. అయితే వ‌కీల్ సాబ్ గురించి ఓ ఆస‌క్తిక‌ర డిబేట్ సోష‌ల్ మీడియాల్లో హీట్ పెంచుతోంది.

నిజానికి ఈ సినిమా పింక్ కి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కి క‌థానాయిక‌ను యాడ్ చేసి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని జోడించ‌డంతోనే టోట‌ల్ టోన్ మారిపోయి క‌మ‌ర్షియ‌ల్ అయిపోయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టీమ్ లో శ్రుతిహాస‌న్ చేరిక‌తోనే గ్లామ‌ర్ యాడై అస‌లు థీమ్ చెడుతుంద‌ని ఇదివ‌ర‌కే ప్ర‌చార‌మైంది. పింక్ క‌థ కూడా డైవ‌ర్ట్ అయ్యింద‌ని గుస‌గుసా వినిపించింది.

అయితే చిత్ర‌బృందం చెబుతున్న‌ది వేరేగా ఉంది. పింక్ ఒరిజిన‌ల్ థీమ్ ఎక్క‌డా చెడ‌కుండా అద‌నంగా కొన్ని క‌మ‌ర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించార‌న్న‌ది టీమ్ చెబుతున్న మాట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగానే ఈ మార్పు ఉంటుంద‌ట‌. కోర్టు డ్రామా‌.. ఎమోష‌న‌ల్ సీన్స్ లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని కూడా చెబుతున్నారు.

పింక్ ఒక అమ్మాయి దృక్పథంలో ఎలా సాగిందో ఇప్పుడు వ‌కీల్ సాబ్ కూడా అలానే సాగుతుంది. థీమ్ లైన్ ని అస్స‌లు విడిచిపెట్ట‌రు అని చెబుతున్నారు. ఇందులో శ్రుతి హాసన్ వకీల్ కి భార్యగా నటించగా.. విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ శక్తివంతమైన పాత్రలో న‌టించారు. అంజలి- నివేదా థామస్- అనన్య ఇతర ముఖ్యమైన పాత్రల్లో క‌నిపిస్తారు.