Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి మాస్ట‌ర్ పై `వ‌కీల్ సాబ్`దే పైచేయి!

By:  Tupaki Desk   |   14 April 2021 6:31 AM GMT
ద‌ళ‌ప‌తి మాస్ట‌ర్ పై `వ‌కీల్ సాబ్`దే పైచేయి!
X
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన‌ `వకీల్ సాబ్` మొదటి 3 రోజుల్లో ద‌ళ‌పతి విజయ్ మాస్టర్ రికార్డును బ్రేక్ చేసిందా? అంటే అవున‌నే తాజా లెక్క‌లు చెబుతున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌వ‌న్ మానియా ముందు ఎవ‌రూ నిల‌బ‌డ‌ర‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ తొలి వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ప‌రిశీలిస్తే...COVID-19 భ‌యాలు టిక్కెట్ రేట్ల త‌గ్గింపు వివాదం వ‌గైరా ఏవీ వ‌సూళ్ల‌ను ఆప‌లేదు. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే మ్యాజిక్ మార్క్ ని తాకింది. 100 కోట్ల మార్క్ కేక్ ‌వాక్ కాగా వ‌కీల్ సాబ్ మొదటి 3 రోజుల వ‌సూళ్లు ద‌ళ‌పతి విజయ్ సంక్రాంతి రిలీజ్ `మాస్టర్`‌ను అధిగమించింది.

జనవరిలో విడుదలైన మాస్టర్ ఇప్ప‌టికే బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీతోనూ త‌మిళంలో బాగా ఆడింది ఈ చిత్రం. ఇది మిడ్-వీక్ రిలీజ్ .. బుధవారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. తమిళం- తెలుగు- కన్నడ వెర్షన్ తో సహా 34.80 కోట్ల బంపర్ ఓపెనింగులు సాధించింది. తొలి 3 రోజుల్లో ద‌ళ‌పతి విజయ్-విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం 69 కోట్ల వ‌సూళ్ల‌ను చేసింది.

వకీల్ సాబ్ అదే మూడు రోజుల్లో ఆ మొత్తం కంటే రూ. 2 కోట్లు అధికంగానే వ‌సూలు చేసింది. రెగ్యులర్ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి 3 రోజుల్లో వరుసగా డే 1 డే 2 డే 3 వ‌సూళ్లు చూస్తే.. 38 కోట్లు- 16.50 కోట్లు-17 కోట్లు క‌లెక్ట్ చేసింది. తొలి వీకెండ్ మొత్తం క‌లుపుకుని 71.50 కోట్లు సంపాదించింది. ఇది చాలా పెద్ద ఫీట్ అని విశ్లేషిస్తున్నారు. సెకండ్ వేవ్ ప్ర‌భావంతో వ‌కీల్ సాబ్ కేవ‌లం తెలుగు రాష్ట్రాలు అమెరికా వ‌సూళ్ల‌నే టార్గెట్ చేసింది. చెన్న‌య్ బెంగ‌ళూరులోనూ కొన్ని థియేట‌ర్ల‌లో ఆడుతోంది. అయితే ఇరుగు పొరుగున‌ చాలా థియేట‌ర్ల‌లో 50శాతం ఆక్యుపెన్సీ నియ‌మం ఇబ్బందిక‌రంగా మారింది.