Begin typing your search above and press return to search.

ఉప్పెన సాంగ్.. 10 మిలియన్ వ్యూస్ దాటిందోచ్!

By:  Tupaki Desk   |   7 March 2020 8:10 AM GMT
ఉప్పెన సాంగ్.. 10 మిలియన్ వ్యూస్ దాటిందోచ్!
X
మెగా ఫ్యామిలీ నుంచి హీరో గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం 'ఉప్పెన' లో నటిస్తున్నాడు. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరికీ కూడా ఇదే డెబ్యూ సినిమా కావడం విశేషం. ఏప్రిల్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈమధ్యే ఈ సినిమా నుంచి 'నీ కన్ను నీలి సముద్రం' అంటూ సాగే మొదటి పాటను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఖవ్వాలి స్టైల్ లో సాగే ఈ గీతానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఓ చక్కని ట్యూన్ అందించారు. రకీబ్ ఆలమ్.. శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించగా.. జావేద్ అలీ.. శ్రీకాంత్ చంద్ర పాడారు. రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే ఈ పాటకు అధికారిక యూట్యూబ్ ఛానెల్ లోనే 10 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. అంతే కాకుండా ఈ పాటకు 1.42 లక్షల లైక్స్ వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో పది మిలియన్ వ్యూస్ సాధించడంతో ఈ పాట సూపర్ హిట్ గా మారింది.

ఈమధ్య దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సోసో గా ఉందంటూ కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని ఈ 'నీ కన్ను నీలి సముద్రం' పాట నిరూపిస్తోంది. ఈ ఆల్బమ్ లో ఇతర పాటలు కూడా ఇలానే సంగీత ప్రియులను మెప్పిస్తే రాక్ స్టార్ కు కాస్త రిలీఫ్ దక్కుతుంది. ఇక సినిమా విషయాని కి వస్తే 'ఉప్పెన' లో విజయ్ సేతుపతి.. సాయి చంద్.. బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.