Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు మెగా హీరో డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..!

By:  Tupaki Desk   |   26 Jan 2021 11:40 AM GMT
ఎట్టకేలకు మెగా హీరో డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..!
X
మెగా మేనల్లుడు, సాయి తేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ''ఉప్పెన''. దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ఈ సినిమాని రూపొందింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు మరియు టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు.

'ఉప్పెన' చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ప్రేమ తరంగం ఎప్పుడు థియేటర్స్ ని తాకుతుందో చెప్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఓ పడవలో 'ఉప్పెన' రిలీజ్ పోస్టర్ తీసుకొస్తున్నట్లు చూపించారు. వాస్తవానికి ఈ చిత్రం గతేడాది వేసవిలో రిలీజ్ కావల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి రాకతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో పాటు సాదారణ పరిస్థితులు ఏర్పడటంతో ఎట్టకేలకు 'ఉప్పెన' సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి