Begin typing your search above and press return to search.

డెబ్యూపై అంత బ‌డ్జెట్ అంటే సాహ‌స‌మే

By:  Tupaki Desk   |   1 Feb 2020 12:30 AM GMT
డెబ్యూపై అంత బ‌డ్జెట్ అంటే సాహ‌స‌మే
X
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌` చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు సినిమాకు మంచి బ‌జ్ ని తీసుకొస్తున్నాయి. సుకుమార్ స్క్రిప్టు అందించ‌గా.. శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మెగా మేన‌ల్లుడి ఎంట్రీ మూవీ కావ‌డంతో...మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా మైత్రీ మూవీ మేక్సర్స్ -సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లతో మంత‌నాలు సాగిస్తూ సినిమా క్వాలిటీ.. బ‌డ్జెట్ విష‌యంలో ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఖ‌ర్చు చేస్తున్నారన్న స‌మాచారం ఉంది. త‌మిళ్ నుంచి విజ‌య్ సేతుప‌తిని విల‌న్ పాత్ర‌కు ఒప్పించి బ‌రిలోకి దించ‌డం ఇందులో భాగ‌మే.

అయితే చిత్రీక‌ర‌ణ‌లో స్లోఫేస్ వ‌ల్ల మూవీ బ‌డ్జెట్ అంత‌కంత‌కు పెరిగింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ‌గానే ఖ‌ర్చు అయిందిట‌. ఒక డెబ్యూ మూవీ అయినా దాదాపు 25 కోట్లు పెడుతున్న‌ట్లు స‌మాచారం. సినిమా షూటింగ్ అనుకున్న స‌మ‌యంలో జ‌ర‌గ‌క‌పోవ‌డం... విజ‌య్ సేతు ప‌తి కి భారీగా పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డం.... భారీ సెట్లు..టెక్నిక‌ల్ టీమ్ ను అద‌నంగా తీసుకోవ‌డం.. ఇలా మొత్తంగా సినిమా పూర్త‌య్యే స‌రికి ఖ‌ర్చు ఎంతో లెక్క‌లేస్తే 25 కోట్లు అవుతుందిట‌. అయినా ఆ విష‌యాలేవీ ప‌ట్టించుకోకుండా మైత్రీ సంస్థ‌ ముందుకు సాగుతోందిట‌.

ఏదేమైనా ఓ డెబ్యూ హీరో లాంచింగ్ కోసం మెగా కాంపౌండ్ కాకుండా.. ఓ బ‌య‌ట నిర్మాణ‌ సంస్థ‌ 25 కోట్లు పెట్ట‌డం అంటే పెద్ద రిస్క్ అన్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆడియ‌న్స్ కు తెలియ‌ని ఓ కొత్త ముఖంపై అంత పెట్ట‌డం అంటే.. కేవ‌లం మెగా బ్రాండ్ అనే కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు. మెగా ప్ర‌మోష‌న్ క‌లిసొస్తుంద‌ని మైత్రి సంస్థ రిస్క్ చేసి ఉంటుందా? అయితే ఇప్పుడున్న స‌న్నివేశంలో రిట‌ర్న్స్ అంత ఈజీ కాదు. మార్కెట్ ఉన్న నిఖిల్- నాగ‌చైత‌న్య‌- నితిన్ లాంటి హీరోల సినిమాల‌కే అన్ని కోట్లు పెట్టాలంటే ఆలోచించే ప‌రిస్థితి. అలా చూసుకున్నా మేన‌ల్లుడు ఇంకా డెబ్యూ హీరోనే క‌దా! అయితే ఎట్టి ప‌రిస్థితిలో అన్న సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌ర‌హాలోనే డెబ్యూ సినిమాతో హిట్ కొట్టాల‌న్న పంతం వైష్ణ‌వ్ తేజ్ లో ఉంద‌ట‌. అయితే మైత్రి మాత్రం చాలా పెద్ద రిస్క్ చేస్తోంద‌న్న విశ్లేష‌ణ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో సాగుతోంది.