Begin typing your search above and press return to search.

మెగా హీరోలందు వైష్ణవ్‌ తేజ్‌ వేరు

By:  Tupaki Desk   |   18 May 2021 6:30 AM GMT
మెగా హీరోలందు వైష్ణవ్‌ తేజ్‌ వేరు
X
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో ఎక్కువ శాతం హీరోలు మెగా ఇమేజ్ తో గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా హీరోల్లో ఎక్కువ మంది మెగా స్టార్ నీడలో ఎదిగిన వారే. కాని వైష్ణవ్‌ తేజ్‌ మాత్రం మెగా ఇమేజ్ కు దూరంగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన హీరోలందరు కూడా స్టైలిష్‌ యూత్‌ ఐకాన్‌ పాత్రల్లో కనిపించారు. కాని వైష్ణవ్‌ తేజ్ మాత్రం ఉప్పెనలో ఒక సింపుల్ పాత్రలో అది కూడా ఏ హీరో ఒప్పుకోని సాహస పాత్రకు ఒప్పుకున్నాడు. మెగా హీరో నుండి ఇలాంటి సినిమా ఊహించలేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు.

ఉప్పెన తర్వాత అయినా రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను చేసి మెగా హీరోగా స్టార్‌ డం దక్కించుకునేందుకు వైష్ణవ్‌ తేజ్ ప్రయత్నిస్తాడేమో అనుకుంటే వెంటనే క్రిష్ దర్శకత్వంలో ఒక విలక్షణ కథతో నాన్‌ కమర్షియల్‌ సినిమాను చేశాడు. ఆ సినిమా విడుదల కాకుండానే మరో సినిమాకు కూడా వైష్ణవ్‌ తేజ్ ఓకే చెప్పాడు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ కారణంగా పలువురు స్టార్‌ డైరెక్టర్స్ వైష్ణవ్‌ తేజ్‌ తో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కాని వైష్ణవ్‌ మాత్రం కొత్త వారితో మంచి కాన్సెప్ట్‌ లను ఎంపిక చేసుకుని చేస్తున్నాడు. మూడవ సినిమా గిరీషయ్య దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అప్పుడే నాల్గవ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయి.

వైష్ణవ్‌ తేజ్‌ నాల్గవ సినిమాతో పృథ్వీ అనే కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు. ఇదో స్పోర్ట్స్ డ్రామా అని... క్లైమాక్స్ చాలా విభిన్నంగా ఉంటుందని మెగా ఫ్యామిలీ హీరోలు గతంలో ఎప్పుడు ఇలాంటి క్లైమాక్స్‌ ను చేసి ఉండరంటూ మీడియా సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే మెగా హీరోలందు వైష్ణవ్‌ తేజ్ వేరు అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో కూడా చర్చించుకుంటున్నారు. వైష్ణవ్‌ తేజ్ ఇదే తరహాలో కెరీర్‌ లో ముందుకు వెళ్తే మేనమామ తరహాలో సొంతంగా స్టార్‌ డంను దక్కించుకునే అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.