Begin typing your search above and press return to search.

వైష్ణవ్‌ తేజ్‌ 'మెగా హీరో'లా అనిపించడట!

By:  Tupaki Desk   |   8 July 2021 6:03 AM GMT
వైష్ణవ్‌ తేజ్‌ మెగా హీరోలా అనిపించడట!
X
మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇటీవల ఉప్పెన సినిమాతో హీరోగా వైష్ణవ్‌ తేజ్ పరిచయం అయ్యాడు. మెగా స్టార్‌.. పవర్‌ స్టార్‌ లకు మేనల్లుడు అయినా కూడా వైష్ణవ్‌ తేజ్‌ మాత్రం చాలా సింపుల్‌ గా ఉంటాడు అంటూ ఉప్పెన చిత్రంలో నటించిన పలువురు నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంటూ ఉండేవారు. తాజాగా ఉప్పెన సినిమాలో నటించిన సీనియర్ నటుడు నాగ మహేష్‌ మాట్లాడాడు. వైష్ణవ్‌ తేజ్ తో ఒకే ఒక్క సీన్ ను నటించే అవకాశం వచ్చిందని.. అయినా కూడా ఆయన గురించి ఆ సమయంలోనే చాలా తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ మహేష్‌ మాట్లాడుతూ.. వైష్ణవ్‌ తేజ్‌ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అయినా కూడా అలా అనిపించడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినట్లుగా ఎక్కడ కూడా చూపించడు. ఆయన సెట్‌ లో ప్రతి ఒక్కరితో సరదాగా మాట్లాడటంతో పాటు ఎంతో గౌరవంగా చూసే వారు. సెట్‌ లో ప్రతి ఒక్కరితో కూడా వారి పేరు లేదా ఏదైనా రిలేషన్‌ తో పిలుస్తాడు. ప్రతి ఒక్కరి పేరును గుర్తు పెట్టుకుని మరీ వారి గురించి అడుగుతూ ఉండేవాడు. హీరోగా పెద్ద ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చినా కూడా వైష్ణవ్‌ తేజ్ అందుకు సంబంధించిన ఫీలింగ్స్ ను చూపించేవాడు కాదు. నేను మాత్రమే కాదు ఆయనతో ఉప్పెన సమయంలో వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు గుర్తు. ఇప్పటికి కూడా ఆయన గుర్తు పట్టి పలకరిస్తూ ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలు కూడా మెగా ఇమేజ్ ను పట్టించుకోకుండా అందరితో కలుపుగొలుపుగా ఉంటారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అనే టాక్‌ ఉంది. ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారు బ్యాక్‌ గ్రౌండ్‌ లేని హీరోలు ఎంతగా అయితే కష్టపడతారో అంతే కష్టపడతారు. గోల్డెన్‌ స్పూన్‌ ఉంది కదా అని అతి చేయరు అంటూ కూడా టాక్ ఉంది. ఈ విషయంలో వైష్ణవ్‌ తేజ్‌ మరింత సింపుల్‌ గా ఉంటాడని నాగ మహేష్‌ వ్యాఖ్యలతో అర్థం అవుతుంది.

ఇక వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా రూపొందిన ఆ సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మూడవ సినిమా ను తమిళ అర్జున్‌ రెడ్డి ని తెరకెక్కించిన గిరీశయ్య దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఈయన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాంతో పాటు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కూడా ఈయనతో మరో సినిమాను చేయాలని ఆశిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మెగా ఫ్యామిలీ అభిమానులు వైష్ణవ్‌ తేజ్‌ ను ప్రత్యేకంగా చూస్తున్నారు.