Begin typing your search above and press return to search.

రాంగ్ టైమింగ్ 'అబ్బాయ్'

By:  Tupaki Desk   |   2 March 2020 3:04 PM GMT
రాంగ్ టైమింగ్ అబ్బాయ్
X
ఏ సినిమా ప్రమోషన్స్ కయినా టైమింగ్ అనేది చాలా ముఖ్యం. అందుకే చాలా మంది అప్డేట్ వదిలే ముందే మిగతా సినిమాలకు సంబంధించి ఆ రోజు ఇంకేదైనా ప్రమోషన్ ప్లాన్ ఉందేమో చెక్ చేసుకుంటారు. ఒక వేళ పెద్ద సినిమా ఫస్ట్ లుక్ లాంటివి ఉంటే తమ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ప్లాన్ లో మార్పు చేసుకుంటారు. అలా చూసుకోకపోతే ప్రమోషన్ అనుకున్నంత రేంజ్ కి వెళ్ళదు. ఈ రోజు మెగా యంగ్ హీరోకి అదే జరిగింది.

సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' ఫస్ట్ సాంగ్ అంటూ ఈ రోజు డేట్ ని వారం ముందే లాక్ చేసుకున్నారు. నిన్నటి నుండి సాంగ్ వస్తుందంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. కానీ కట్ చేస్తే అనుకోకుండా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగాడు. మేకర్స్ ఉన్నపళంగా 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రేపే విడుదల అంటూ నిన్న సాయంత్రం ఓ అప్డేట్ వదిలారు. ఇక పవన్ మేనియా ముందు వైష్ణవ్ తేజ్ సాంగ్ నిలబడుతుండా అనే అనుమానాలు మొదలయ్యాయి.

కట్ చేస్తే అదే జరిగింది. అసలే రెండేళ్ళ తర్వాత పవన్ సినిమా పోస్టర్ ఫస్ట్ లుక్ రావడంతో గంట ముందు నుండే అందరూ వకీల్ సాబ్ మీదే పూర్తి ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలో వకీల్ సాబ్ చర్చే సాగింది. దీంతో ఉప్పెన సాంగ్ బాగున్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా మావయ్య మేనియా ముందు వైష్ణవ్ తేజ్ సాంగ్ ప్రమోషన్ లో వెనకబడింది. ఏదైనా ఫ్రీ టైంలో అందరి ఫోకస్ ఉండేలా డేట్ చూసి సాంగ్ వదిలిస్తే వెంటనే మిలియన్ వ్యూస్ కొల్లగోట్టేది. ఇదే కదా రాంగ్ టైమింగ్ అంటే మరి.