Begin typing your search above and press return to search.

వైష్ణ‌వ్ తేజ్ భ‌విష్య‌త్ ఏంటి?

By:  Tupaki Desk   |   11 April 2019 3:08 PM IST
వైష్ణ‌వ్ తేజ్ భ‌విష్య‌త్ ఏంటి?
X
మెగా కాంపౌండ్ హీరో అన్న ట్యాగ్ లైన్ తో హిట్లు కొట్టేస్తామంటే కుదురుతుందా? అంటే అస్స‌లు కుదర‌దు. అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం సాయిధ‌ర‌మ్ తేజ్. మెగా మేన‌ల్లుడిగా ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో ఒకే ఒక్క హిట్టు. ఏకంగా అర‌డ‌జ‌ను ఫ్లాపులున్నాయి. అయితే ఇక్క‌డ డెస్టినీని ఎవ‌రూ నిర్ణ‌యించ‌లేర‌ని ఎవ‌రి కెరీర్ కి వారే బాధ్య‌త వ‌హించాల‌ని సాయిధ‌ర‌మ్ అన్నారు. మెగా హీరో అన్న ట్యాగ్ తో త‌న‌కు రెండే రెండు అవ‌కాశాలొచ్చాయ‌ని.. అటుపై త‌న‌ని తాను నిరూపించుకోవాల్సిన స‌న్నివేశం ఎదురైంద‌ని తెలిపారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌క‌పోతే ఏ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వ్య‌ర్థ‌మ‌ని అనుభ‌వ పూర్వ‌కంగా తెలిపారు.

ఇంత‌కీ మీ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ (మెగా మేన‌ల్లుడు 2) భ‌విష్య‌త్ ఏంటి? అత‌డి డెబ్యూ సినిమాలో మీ ఇన్వాల్వ్ మెంట్ ఎంత‌వ‌ర‌కూ? అని ప్ర‌శ్నిస్తే.. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అనేశారు. సినిమా రిలీజ్ టైంలో నాకు ఎలాగైతే ప్రేక్ష‌కులు ఆశీస్సులు ఇచ్చారో వాడికి ఇవ్వాల‌ని ఆశిస్తున్నాను. అత‌డి న‌ట‌న న‌చ్చితేనే ప్రేక్ష‌కుల‌కు ఓకే చేస్తార‌ని నిర్మొహ‌మాటంగా అన్నారు. వైష్ణ‌వ్ కి మీరు జాగ్ర‌త్త‌లు చెప్పారా? అని ప్ర‌శ్నిస్తే.. ``త‌న‌కు తానుగానే నేర్చుకోవాలి... ప‌డాలి.. లేవాలి.. ప‌ర్స‌న‌ల్‌ గా అనుభ‌వం అవ్వాలి ఏదైనా.. దాని నుంచి నేర్చుకుని ఎద‌గాలి`` అనీ అన్నారు.

వైష్ణ‌వ్ సినిమా క‌థను మీరు విన్నారా? అని ప్ర‌శ్నిస్తే.. విన్నాను. త‌ర్వాత కూడా విన‌మంటే వింటా. నేను ప్ర‌త్యేకించి ఛాయిస్ తీసుకోలేను అనీ అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌త‌హాగానే ప‌డుతూ లేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంద‌ని అది ఏ ఫ్యామిలీ హీరోకి అయినా వ‌ర్తిస్తుంద‌ని సాయిధ‌ర‌మ్ క్లియ‌ర్ క‌ట్ గా చెబుతున్నారు. అంటే సోద‌రుడికి ప్ర‌తిదీ తాను ద‌గ్గ‌రుండి గైడ్ చేయ‌న‌ని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడ‌న్న‌మాట‌. వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. రంగ‌స్థ‌లం త‌ర‌హాలో ర‌గ్గ్ డ్ లుక్ తో వైష్ణ‌వ్ తేజ్ ని ఆవిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌త్స్య‌కారుల నేప‌థ్యంలో క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌తిష్ఠాత్మ‌క మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.