Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమాలో మరాఠీ హీరోయిన్

By:  Tupaki Desk   |   9 April 2017 5:22 AM GMT
మెగాస్టార్ సినిమాలో మరాఠీ హీరోయిన్
X
బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాకర్.. ఇప్పుడు సినీ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సాయికుమార్ కొడుకు ఆది హీరోగా ఓ నెల రోజుల క్రితం సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాకర్. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు.

వైభవి శాండిల్య అనే మరాఠీ భామను ఆదికి జోడీగా నటింపచేస్తుండగా.. ఈమె టాలీవుడ్ జనాలకు మాత్రమే కొత్త. ఇప్పటికే పలు మరాఠీ భాషల్లో నటించిన వైభవి.. ప్రస్తుతం తమిళ్.. కన్నడ సినిమాల్లో కూడా చేసేస్తోంది. ఇప్పుడు ప్రభాకర్-ఆదిల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ద్వారా టాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతోంది ఈ చిన్నది. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు నటనా పరంగా చాలా ఎక్కువగా స్కోప్ ఉండడంతో.. పెర్ఫామెన్స్ బేస్డ్ ఆర్టిస్ట్ కోసం వెతికాడట దర్శకుడు ప్రభాకర్. భరతనాట్యం.. కథక్ నాట్యాలలో కూడా ప్రావీణ్యం ఉన్న వైభవి శాండిల్య దగ్గర ఈ డైరెక్టర్ సెర్చ్ ఆగిందని తెలుస్తోంది.

ప్రభాకర్ చెప్పిన స్టోరీ వినగానే ఎంతో థ్రిల్ ఫీలయిన వైభవి.. తన టాలీవుడ్ అరంగేట్రానికి ఈ చిత్రం మంచి లాంచ్ ప్యాడ్ అవుతుందని భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈమెతో అగ్రిమెంట్స్ చేసుకునే దశలో ఉన్నారు ఫిలిం యూనిట్ త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టేసేందుకు ప్రభాకర్ అండ్ టీం రెడీ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/