Begin typing your search above and press return to search.

చరణ్-సుక్కు సినిమాలో అనుకోని అతిథి

By:  Tupaki Desk   |   1 March 2017 9:49 AM GMT
చరణ్-సుక్కు సినిమాలో అనుకోని అతిథి
X
రామ్ చరణ్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగుకి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తోంది. గత నెలలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే చరణ్ లుక్ విషయంలో చాలా టెస్టులవీ చేసి.. ఫైనల్ గా ఒక లుక్ ఫైనలైజ్ చేసేశాడు సుక్కు. ఇప్పుడు దానికి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఈ లోపు నటీనటుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది. ‘నాన్నకు ప్రేమతో’లో విలన్ పాత్ర చేసిన జగపతి బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ అనుకోని అతిథి మరో కీలక పాత్ర చేస్తుండటం విశేషం. అతను మరెవరో కాదు.. కోలీవుడ్లో మంచి పేరు సంపాదించిన తెలుగు నటుడు వైభవ్.

కోదండరామిరెడ్డి కొడుకైన వైభవ్ తెలుగులో ‘గొడవ’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. ఐతే తమిళంలో మాత్రం అతను మంచి పేరే సంపాదించాడు. హీరోగానే కాక.. క్యారెక్టర్.. నెగెటివ్ రోల్స్ తో మెప్పించాడు. తమిళంలో బిజీగా ఉన్న వైభవన్ ను ఏరి కోరి సుక్కు ఈ సినిమాకు తీసుకున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. వైభవ్ తండ్రి కోదండరామిరెడ్డి చిరంజీవితో ఎన్నెన్ని హిట్లిచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిరు-వైభవ్ కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/