Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: వరుడు కావలెను అంటూ వడ్డాణం చుట్టేసి వచ్చిన భామలు..!

By:  Tupaki Desk   |   27 Oct 2021 6:59 AM GMT
వీడియో సాంగ్: వరుడు కావలెను అంటూ వడ్డాణం చుట్టేసి వచ్చిన భామలు..!
X
యంగ్ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ''వరుడు కావలెను''. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అంతేకంటే ముందుగా ఈరోజు ఉదయం సినిమాలోని 'వడ్డాణం' అనే వీడియో సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు.. వయ్యారం చిందేసే అందాల బొమ్మలు.. క్యా కరే.. పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే..' అంటూ సాగిన ఈ పాట వీక్షకులను అలరిస్తోంది. పెళ్లి వేడుక నేపథ్యంలో కలర్ ఫుల్ గా ఉన్న ఈ పాటలో హీరోహీరోయిన్లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం అంతా కనిపిస్తున్నారు. ఈ పెప్పీ నంబర్ కు ఎస్.ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. గేయ రచయిత రఘురామ్ ఈ గీతానికి సాహిత్యం అందించారు.

'వడ్డాణం' పాటను గీతా మాధురి - ఏఎల్ గాయత్రి - అదితి భావరాజు - శృతి రంజని వంటి గాయనీమణులు ఆలపించారు. వీరితో పాటు శ్రీకృష్ణ - సత్య యామిని - సాహితీ - మనీషా - శ్రీనిధి - రవళి - అభిఖ్య వంటి వారు గొంతు కలిపారు. ఈ పాటలో హీరోయిన్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు.

'వరుడు కావలెను' చిత్రంలో 'కోల కళ్ళే' 'మనసులోనే నిలచిపోకే' పాటలకు విశాల్ చంద్ర శేఖర్ స్వరాలు సమకూర్చారు. 'దిగు దిగు దిగు నాగ' 'వడ్డాణం' పాటలకు మాత్రం థమన్ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. లవ్ - ఫన్ అండ్ ఎమోషన్స్ కలబోసిన ఈ కుటుంబ కథా చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.