Begin typing your search above and press return to search.

స్టాఫ్ కి వారి కుటుంబీకుల‌కు బ‌న్ని వ్యాక్సినేష‌న్

By:  Tupaki Desk   |   19 May 2021 5:00 PM IST
స్టాఫ్ కి వారి కుటుంబీకుల‌కు బ‌న్ని వ్యాక్సినేష‌న్
X
సెకండ్ వేవ్ త‌ర్వాత సెల‌బ్రిటీలంతా ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. వ్యాక్సినేష‌న్ వేయించుకుంటున్నారు. అలాగే టీకా అవ‌స‌రాన్ని ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం చేయ‌డ‌మే గాక‌.. త‌మ ఇంట్లో ఆఫీసుల్లో ప‌ని చేసే స్టాఫ్ కి కచ్ఛితంగా వ్యాక్సినేష‌న్ చేయిస్తున్నారు. మెగా కాంపౌండ్ స‌హా.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఈ త‌ర‌హా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి.

తాజా స‌మాచారం మేర‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న స్టాఫ్ కి వారి కుటుంబీకుల‌కు కూడా వ్యాక్సినేష‌న్ చేయిస్తున్నారు. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా స్టాఫ్ విష‌యంలో ప్ర‌తిదీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన అతని సిబ్బందికి టీకాలు వేసేలా చూసుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసి 45 ఏళ్లు పైబడిన తన కోర్ టీం కుటుంబ సభ్యులకు వ్యాక్సినేష‌న్ అందేలా చూసుకున్నార‌ని తెలిసింది.

ఇటీవ‌లే `పుష్ప` సెట్స్ లో కోవిడ్ సోకిన బ‌న్ని గృహ‌నిర్భంధంలోకి వెళ్లారు. అనంత‌రం వైద్య‌ చికిత్స‌తో పూర్తిగా కోలుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే తిరిగి సెట్స్ కెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు రెడీ చేస్తున్నార‌ని తెలిసింది.