Begin typing your search above and press return to search.

ఆ అత్త‌ను తెచ్చి ఈ అత్త‌ను వ‌దిలేశారు!

By:  Tupaki Desk   |   3 Aug 2018 9:40 AM IST
ఆ అత్త‌ను తెచ్చి ఈ అత్త‌ను వ‌దిలేశారు!
X
ద‌స‌రా బుల్లోడు .. అక్కినేని అంద‌గాడు ఏఎన్నార్ స‌ర‌స‌న నటించిన మేటి క‌థానాయిక‌ వాణిశ్రీ‌. స‌మ‌కాలికంగా నాటి స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన అగ్ర‌క‌థానాయిక‌. ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌ - శోభ‌న్‌ బాబు - కృష్ణ వంటి స్టారాధిస్టార్ల స‌ర‌స‌న బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి - యువ‌సామ్రాట్ అక్కినేని నాగార్జున సినిమాల్లో పొగ‌రుమోతు అత్త పాత్ర‌ల్లోనూ మెప్పించారు. అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు - అల్ల‌రి అల్లుడు వంటి చిత్రాల్లో ఒగ‌రు పొగ‌రు ఉన్న అత్త‌గా వాణిశ్రీ అభిన‌యాన్ని తెలుగు ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అయితే బుల్లితెర‌పై ఆ సినిమాలు టెలీకాస్ట్ అయిన‌ప్పుడు నేటి జ‌న‌రేష‌న్‌ కి తెలుస్తోంది.. కానీ మిగ‌తా స‌మ‌యంలో ప్ర‌శ్నార్థ‌క‌మే!

కాలంతో పాటే జ‌నానికి మ‌తిమ‌రుపు. అంతటి మేటి క‌థానాయిక‌ వాణీశ్రీ‌ని మ‌ర్చిపోయారా ఈ జ‌నం అన్న సందేహాలు వ‌స్తున్నాయి. నేటి జ‌న‌రేషన్ క‌థానాయిక‌ల‌కు అభిన‌యం ప‌రంగా వాణిశ్రీ ఓ డిక్ష‌న‌రీ అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఇప్పుడొస్తున్న క్యాట్‌ వాక్ డాల్స్ ఆ విష‌యాన్ని అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌ని భావించ‌లేం. అదంతా స‌రే.. వాణిశ్రీ మ్యాడ‌మ్‌ ని క‌నీసం అక్కినేని కాంపౌండ్ అయినా గుర్తు పెట్టుకుందా? అంటే.. ప్చ్‌! అనే అర్థ‌మ‌వుతోంది.

కింగ్ `అల్ల‌రి అల్లుడు`లో అత్త‌గా న‌టించిన వాణిశ్రీ‌ని మ‌ర్చిపోయి - ఇప్పుడు నాగ‌చైత‌న్య‌ అత్త శైల‌జారెడ్డిగా ర‌మ్య‌కృష్ణ‌ను ఎంపిక చేసుకున్నారు. `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్తగా పెర్ఫెక్ట్ అన‌డంలో సందేహం లేదు. అయితే నాటి న‌టీమ‌ణి వాణిశ్రీ‌ని మ‌రువ‌డం త‌గ‌ద‌న్న‌ది అభిమానుల వాద‌న‌. ఇంత‌కీ అక్కినేని కాంపౌండ్ వాణిశ్రీ‌ని మ‌రోసారి గుర్తు చేసుకుంటుందా? లేదా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నేడు వాణిశ్రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్‌.