Begin typing your search above and press return to search.

`ఆహా క‌ళ్యాణం` బ్యూటీ ఔరా అనిపించేలా!

By:  Tupaki Desk   |   20 Oct 2021 12:30 PM GMT
`ఆహా క‌ళ్యాణం`  బ్యూటీ ఔరా అనిపించేలా!
X
తెలుగు ప్రేక్ష‌కుల‌కు వాణీ క‌పూర్ సుప‌రిచితురాలే. కానీ
`ఆహా క‌ళ్యాణం` సినిమా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేసి అక్క‌డ స‌క్సెస్ అయింది. బాలీవుడ్ లో `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి క‌పూర్ అటుపై `బేఫ్ క్రే`..`వార్` లాంటి చిత్రాల‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ప్ర‌స్తుతం అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ అంద‌రితోనూ ఛాన్సులందుకుంటోంది. అయితే క‌పూర్ వంశ‌స్తురాలైనా వాణీ ప‌రిశ్ర‌మ‌లో రాణించ‌డానికి..నిల‌దొక్కుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది.

ఓ వైపు కుటుంబాన్ని పోషిస్తూనే సినిమాల్లో నిల‌దొక్కునే ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయింది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే వాణీక‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటో సెష‌న్ల‌లో పాల్గొని..ఇంట్రెస్టింగ్ ఫోటోల‌న్నింటిని ఇన్ స్టా వేదిక‌గా ఫాలోవ‌ర్స్ కి షేర్ చేస్తుంటుంది. ఇప్ప‌టికే చాలాసార్లు టెంప్టింగ్ ఫోటోల‌తో ర‌చ్చ చేసిన భామ మరోసారి ఇన్ స్టా వేదిక‌గా చెల‌రేగిపోయింది. అయితే ఈసారి అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. టాప్ లో బ్లాక్ షోల్డ‌ర్ లెస్ బ‌నియ‌న్ ధ‌రించ‌గా..బాట‌మ్ లో డార్క్ ఆరేంజ్ వ‌స్ర్తంపై డిజైన్డ్ వేర్ ని ధ‌రించింది.

ఈ ఫోటో లో వాణీ క‌పూర్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. వాణీ కపూర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించ‌నంత‌గా రాణించ‌లేదు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు. అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో `చండీఘ‌ర్ క‌రే ఆశీకిల్` లో న‌టిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నాడు.