Begin typing your search above and press return to search.

`ఆహా క‌ళ్యాణం` బ్యూటీ ఔరా అనిపించేలా

By:  Tupaki Desk   |   31 Aug 2021 11:30 AM GMT
`ఆహా క‌ళ్యాణం` బ్యూటీ ఔరా అనిపించేలా
X
బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ ఏడాదికి ఒక‌ట్రెండు సినిమాలు మాత్ర‌మే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసే రేంజ్ కి చేరుకుంది. వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బిజీ న‌టిగా మారిపోయింది. వాణీ ఇటీవ‌లే `బెల్ బాట‌మ్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా చ‌క్క‌ని రివ్యూల్ని అందుకున్నా కానీ క‌రోనా క్రైసిస్ పెద్ద దెబ్బ కొట్టింది. త్వ‌ర‌లోనే వాణీక‌పూర్ మ‌రో రెండు సినిమాల‌తో బాక్సాఫీస్ ముందుకు రానుంది.

`షంషేరా`..`చండీఘ‌ర్ క‌రే ఆశీక్` చిత్రాలు షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాల‌పైనా అమ్మ‌డు భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఏడాదిలో వ‌రుస‌గా మూడు సినిమాలు రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది అమ్మ‌డి కెరీర్ లో ఇదే తొలిసారి.

దుర‌దృష్ట‌వ‌శాత్తూ `బెల్ బాట‌మ్` బాక్సాఫీస్ ఫిగ‌ర్స్ ని ఆశించిన స్థాయిలో అందుకోక‌పోవ‌డంతో ఈ రెండిటితోనైనా పెద్ద‌ స‌క్సెస్ అందుకుని మ‌రింత బిజీ అవ్వాల‌ని ఆశిస్తోంది. ఇక టాలీవుడ్ లో `ఆహా క‌ళ్యాణం` చిత్రంతో వాణీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పెద్ద స‌క్సెస్ అవ్వ‌క‌పోడంతో త‌దుప‌రి అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ పైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తోంది. ఇక వాణీ క‌పూర్ ఇన్ స్టాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం ఏదో ఒక‌ ఫోటో షూట్ తో ఫాలోవర్స్ కి ట‌చ్ లో ఉంటుంది. టెప్టింగ్ ఫోటో షూట్ల‌కు దూరంగా ట్రెడీష‌న‌ల్ గాళ్ల్ గానే ఆక‌ట్టుకోవ‌డానికి ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తుంది. తాజాగా సంప్ర‌దయ ప‌ద్ద‌తిలో ఓ కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిస్తోంది.

గ్రీన్ క‌ల‌ర్ లంగా మ్యాచింగ్ జాకెట్ లో బ్యాక్ సొగ‌సును ఆవిష్క‌రించి ఆక‌ట్టుకుంది. నుదుటిన ఆ కోల‌ ముఖాన్ని డామినేట్ చేసేంత పెద్ద పాపాడి బొట్టు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. దీనిపై అభిమానులు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. వాణీ క‌పూర్ హాట్ ఫోటోషూట్లు నిరంత‌రం అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల‌ సైజ్ జీరో బాడీని మెయింటెన్ చేయ‌డంతో లుక్స్ పై ప్రత్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంద‌ని నేటిత‌రం వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.

సౌత్ లో రీఎంట్రీ ఘ‌నంగా..

నాని స‌ర‌స‌న ఆహాక‌ళ్యాణంలో న‌టించిన వాణీ ఆ త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌కు పూర్తిగా దూరంగా ఉంది. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ ప్రాజెక్ట్.కె తో తిరిగి ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతున్న ప్రాజెక్ట్ ఇది. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. హాలీవుడ్ మూవీ ఐ రోబో రేంజులో అవ‌తార్ టెక్నిక్స్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొనే త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాయి. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని కోడలు సమంతతో కూడా చర్చలు జరుపుతున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. అలాగే వాణీ కపూర్ పాత్ర కూడా సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇంకా భారీ కాస్టింగ్ నాగ్ అశ్విన్ టీమ్ లో చేరేందుకు వీలుంద‌ని తెలుస్తోంది.

భారత‌దేశంలో అత్యంత భారీ కాన్వాసుపై తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మెజారిటీ భాగం కేవ‌లం సెట్స్ లోనే పూర్తి చేస్తారు. అందుకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ల‌ను డిజైన్ చేసి తెర‌కెక్కిస్తున్నారు. భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంతో వాణీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేయ‌బోతోంది. అలాగే వాణీ క‌పూర్ కెరీర్ ఆరంభం ఎన్నో ఒడిదుడుకులు అందుకుని త‌న కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు త‌ప్ప‌న‌స‌రి ప‌రిస్థితిలో మోడ‌లింగ్ రంగంలో ప్ర‌వేశంచింది. ఆ ర‌త్వాత సినీపెద్ద‌ల అండ‌దండ‌ల‌తో క‌థానాయిక‌గా రాణిస్తోంద‌న్న సంగ‌తి తెలిసిన‌దే.