Begin typing your search above and press return to search.

సెక్సీ కపూర్ కు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   14 May 2018 8:22 AM GMT
సెక్సీ కపూర్ కు బంపర్ ఆఫర్
X
వాణీ క‌పూర్ మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తురావ‌డం క‌ష్ట‌మే. అప్పుడెప్పుడో నానితో క‌లిసి ఆహా క‌ళ్యాణం అని ఓ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీ చేసింది. ఆ త‌రువాత ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ బాలీవుడ్‌ కు వెళ్లిపోయింది. పోనీ అక్క‌డేమైనా క‌లిసొచ్చిందా అంటే అదీలేదు. ఏదో ఓ సినిమాలో ఛాన్సుల అందాలు ఆర‌బోసినా కూడా ఫ‌లితం లేదు. కొన్ని నెల‌ల పాటూ సినిమాలు లేక ఏవో యాడ్స్ చేసుకుంటూ గ‌డిపింది. ఇప్పుడు ఆమెకు బంప‌ర్ ఛాన్స్ ద‌క్కింది.

హిందీలో ర‌ణ్ వీర్ సింగ్‌ తో క‌లిసి బేఫిక‌ర్ సినిమా చేసింది వాణీ క‌పూర్‌. అందులో విప‌రీతంగా ఎక్స్ పోజింగ్ చేసి యూత్ ను ఆక‌ట్టుకుంది. కానీ ఎందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం ప‌ట్టించుకోలేదు. అలాంటి య‌శ్‌ రాజ్ ఫిల్మ్స్ వారి సినిమాలో ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌కుడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ హీరోగా షంషేరా అనే వారియ‌ర్ సినిమాను తీస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల క్రిత‌మే ఆ సినిమాను ప్ర‌క‌టించింది య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌. ఆ సినిమాలో సంజ‌య్ ద‌త్‌ను విల‌న్ గా న‌టిస్తున్నాడు. ర‌ణ్‌బీర్ క‌పూర్ ల‌వ‌ర్‌గా వాణీ క‌పూర్‌ను ఎంపిక చేసిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌. ఆ పాత్ర‌కు వాణీనే స‌రైన ఎంపిక‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంతేకాదు ఆమె డ్యాన్స్ కూడా బాగా చేస్తుంద‌ని ఫ్రెష్ లుక్‌తో ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి వాణీ వెనుక ఉన్న అట్ట‌ర్ ఫ్లాపు సినిమాల గురించి మాత్రం మాట్లాడ‌డం లేదు.

బాహుబ‌లి సినిమాలాగే షంషేరా కూడా ఒక వీరుడి క‌థ అని టాక్‌. ఆ సినిమా చేసేందుకు ర‌ణ్ బీర్ క‌పూర్ ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తున్నాడు. గ‌తంలోనే తాను ఇన్నాళ్లు ఎదురుచూస్తున్న సినిమా ఇప్పుడు దొరికింద‌ని ఆనంద‌ప‌డుతూ చెప్పాడు. షంషేరాకు సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు న‌టీ న‌టుల ఎంపిక జ‌రుగుతుంది. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా షూటింగ్ మొద‌ల‌వుతుంది. వ‌చ్చే ఏడాది విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది.