Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 4వ పోస్టర్ లోనూ ఘాటు ముద్దే

By:  Tupaki Desk   |   9 July 2016 8:12 AM GMT
ఫోటో స్టోరి: 4వ పోస్టర్ లోనూ ఘాటు ముద్దే
X
వామ్మో.. ప్రియురాలు దీపికా పదుకొనె ఏమంటుందో తెలియదు కాని.. ఎంత ప్రొఫెషన్‌ అయితే మాత్రం ఈ రేంజులో రెచ్చిపోతారా అంటూ బాలీవుడ్‌ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటోంది. ''బేఫికర్‌'' సినిమా పోస్టర్లను చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఎవరికైనా పిచ్చెత్తిపోతోంది అంతే.

చాలాకాలం తరువాత డైరక్షన్‌ పగ్గాలను చేపట్టిన ఆదిత్య చోప్రా.. ఒక్కసారి తన కొత్త లవ్ స్టోరీతో విరుచుకుపడుతున్నాడు. ఒక్క సినిమా వండర్ గా మిగిలిపోయిన వాణి కపూర్.. అలాగే ఇప్పుడు టాప్ రేటెడ్‌ యంగ్‌ హీరో అయిన రణవీర్‌ సింగ్‌ తో మనోడు ''బేఫికర్‌'' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు ఫస్టు లుక్ పోస్టర్లు విడుదల చేసి.. ప్రతీ పోస్టర్ లోనూ హీరోహీరోయిన్ గాఢంగా చుంబించుకునే సీన్ చూపెడుతూ సంచలనం సృష్టించారు. ఇవాళే 4వ పోస్టర్ కూడా వచ్చింది. ఇందులో కూడా ఏమీ మారలేదు.

టోటల్ఈ గా ఫ్రాన్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో.. అక్కడి పాపులర్ లొకేషన్లు అన్నింటిలోనూ లీడ్ పెయిర్ ముద్దులే ముద్దులట. ఈసారి కేన్స్ బీచ్‌ లో జీన్స్ నిక్కర్ అండ్ బికినీ టాప్‌ వేసుకున్న వాణి కపూర్ ను గాలిలోకి ఎత్తేసి మరి ముద్దులెట్టేస్తున్నాడు రణవీర్. ఈ ఘాటు ముద్దులపై దీపిక రియాక్షన్‌ ఏంటో మరి.