Begin typing your search above and press return to search.

ముద్దులేని తొలి ఫోటో బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   23 Aug 2016 7:35 AM GMT
ముద్దులేని తొలి ఫోటో బయటకొచ్చింది
X
ప్రతీ నెలా 9వ తారీఖున ఒక కిస్సింగ్ పోస్టర్ రిలీజ్ చేయడం ''బేఫికర్'' టీముకు ఆనవాయితీగా మారింది. ఇప్పటివరకు మనం ఐదు సార్లు రణవీర్ సింగ్ మరియు వాణి కపూర్ ముద్దులు పెట్టుకుంటున్న పోస్టర్లను చూశాం. ఇద్దరూ పెదాలను కొరికేసుకుంటూ.. పారిస్ బ్యాక్ డ్రాపులో అదర చుంబనంతో రొమాన్సును పండించేస్తూ.. రచ్చ రచ్చ చేసేశారు. అయితే అసలు వీరిని పోస్టర్ పై ముద్దులు లేకుండా ఒక్కసారైనా చూడగలమా?

ఇవాళ వాణి కపూర్ పుట్టినరోజు కావడంతో.. దర్శకుడు అండ్ ప్రొడ్యూస్ ఆదిత్య చోప్రా.. ఇవాళ కూడా ఆమెను ముద్దుల్లో ముంచెత్తితే బాగోదులే అనుకున్నాడేమో.. అందుకే తొలిసారి ఈ సినిమా నుండి ముద్దులు లేని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఒక పాటకు సంబంధించిన స్టిల్ లో వాణి కపూర్ ఫ్లాట్ గా ఉన్న తన వాష్‌ బోర్డు యాబ్స్ ను చూపిస్తుంటే.. వారినాయనో అనేంత హాటుగా ఉంది. ఆ ఫోటోను రిలీజ్ చేయడంతో.. ముద్దులేని తొలి ఫోటో అంటూ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అవ్వడం స్టార్టయ్యింది.

డిసెంబర్ 9న బేఫికర్ సినిమా విడుదల కానుంది. అప్పటివరకు నెల నెలా 9వ తారీఖుని ముద్దుల పోస్టర్లు మనముందుకు వస్తూనే ఉంటాయి. ఇకపోతే ఈ సినిమాతో వాణి కపూర్ బాలీవుడ్ లో టాప్ స్టార్ ఎదగాలని చూస్తోంది. తొలి సినిమా షుద్ దేశీ రొమాన్స్ ఫ్లాపయ్యాక రెండో సినిమా కోసం ఇన్నేళ్ళు వెయిట్ చేసిన ఈ 28 ఏళ్ళ భామ.. బేఫికర్ తో గాట్టిగానే కొడతానని ఆశిస్తోంది. ఎనీవే.. హ్యాపీ బర్తడే వాణి.