Begin typing your search above and press return to search.

వినాయక్‌ ఆ రేంజ్‌ లో కష్టపడనున్నాడా?

By:  Tupaki Desk   |   17 Jun 2019 8:39 AM GMT
వినాయక్‌ ఆ రేంజ్‌ లో కష్టపడనున్నాడా?
X
దర్శకుడిగా కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన వినాయక్‌ ఈమద్య కాలంలో కాస్త ఫామ్‌ కోల్పోయాడు. చిరంజీవితో తెరకెక్కించిన 'ఖైదీ నెం.150' చిత్రం ఇండస్ట్రీ హిట్‌ సాధించినా కూడా ఆ సక్సెస్‌ క్రెడిట్‌ వినాయక్‌ కు దక్కలేదు. ఆ సినిమా తర్వాత వినాయక్‌ ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాని ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్లీ దర్శకత్వం చేసేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క హీరో కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమయంలోనే వినాయక్‌ కు హీరోగా ఛాన్స్‌ వచ్చింది.

దర్శకులు నటులు అవ్వడం కొత్తేం కాదు. కాని వినాయక్‌ ఏకంగా హీరోగా నటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్ని వారాల క్రితమే వినాయక్‌ హీరోగా దిల్‌ రాజు నిర్మాణంలో నరసింహారావు దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతుంది అంటూ ప్రకటన వచ్చింది. ఆ చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. ఆ సినిమా కోసం దర్శకుడు వినాయక్‌ బాగా లావు అయ్యాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో వినాయక్‌ కనిపించాడు. వినాయక్‌ గతంతో పోల్చితే అయిదు నుండి పది కేజీల వరకు పెరిగినట్లుగా అనిపించాడు.

ఈ లావు పెరగడం సినిమా కోసమే అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లావు లుక్‌ తో ఎక్కువ శాతం షూటింగ్‌ చేయబోతున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలు గ్యాప్‌ తీసుకుని వినాయక్‌ సన్నబడ్డ తర్వాత మరి కొన్ని సీన్స్‌ తీస్తారట. స్టార్‌ హీరోలు తమ సినిమాల కోసం లావు అవ్వడం.. సన్నబడటం చేస్తూ ఉంటారు. కాని వినాయక్‌ మాత్రం మొదటి సినిమాకే చాలా కష్టపడుతున్నాడు. వినాయక్‌ ను ఇంత కష్టపెడుతున్న దర్శకుడు నరసింహా రావు సినిమాను ఎలా తీస్తాడో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు కనుక మంచి సబ్జెక్ట్‌ అయ్యి ఉంటుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.