Begin typing your search above and press return to search.

సెన్సార్ ముగించి ఓటీటీ కోసం V రెడీ

By:  Tupaki Desk   |   24 Aug 2020 11:00 AM IST
సెన్సార్ ముగించి ఓటీటీ కోసం V రెడీ
X
ఈ సీజ‌న్ లో ఓటీటీలో రాబోతున్న తొలి క్రేజీ చిత్రం V. నాని- సుధీర్ బాబు హీరోలుగా ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం డైరెక్ట్ డిజిట‌ల్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తెలుగు వెర్ష‌న్ ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్ తో సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

తాజాగా సెన్సార్ రిపోర్ట్ అందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు `వి`కి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారని స‌మాచారం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయ‌నున్నారు. ఇక ఈ మూవీకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. నాని కెరీర్ 25వ సినిమా. ల్యాండ్ మార్క్ మూవీని బంప‌ర్ హిట్ చేయ‌డం కోసం అత‌డు చాలా శ్ర‌మించాడు. నాని పాత్ర దొంగ‌గా క‌నిపిస్తుంది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ ‌గా నటించారు. అయితే రెండు జ‌న్మ‌ల్లో ఈ రెండు పాత్ర‌లు ఒకదానికొకటి రివ‌ర్స్ అయ్యి తారుమారు గా స్ట‌న్నింగ్ స‌ర్ ప్రైజ్ ని ఇస్తాయ‌ని అదే ఇంద్ర‌గంటి స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ అని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఇందులో నివేథా థామస్- అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు- నాజర్- వెన్నెల కిశోర్- శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించారు. లాక్ డౌన్ క్రైసిస్ వ‌ల్ల వాయిదా ప‌డిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు అమెజాన్ ప్రైమ్ లో ట్రీటివ్వ‌బోతోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిగా ఉన్న ప్రైమ్ వీక్ష‌కుల‌కు వెల్ ట్రీట్ ఇస్తుంద‌నే భావిద్దాం.