Begin typing your search above and press return to search.

SSMB 28 లో ప్రేమలోకం స్టార్‌..!

By:  Tupaki Desk   |   2 Jun 2022 8:42 AM GMT
SSMB 28 లో ప్రేమలోకం స్టార్‌..!
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. సర్కారు వారి పాట సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే మహేష్‌.. త్రివిక్రమ్‌ ల మూడవ సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.

ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉన్న మహేష్‌ బాబు ఈ సినిమాను త్వరగా మొదలు పెట్టి ఈ ఏడాది చివరి వరకు ముగించాలని భావిస్తున్నాడట.

ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ ను ముగించిన దర్శకుడు త్రివిక్రమ్ నటీ నటులను ఎంపిక చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో కూడా బిజీగా ఉన్నాడట.

ఈ సమయంలో సినిమాలోని కీలక పాత్ర కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ కన్నడ స్టార్‌ నటుడు వి రవిచంద్రన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కథలో అత్యంత కీలకమైన ఆ పాత్రను వి రవిచంద్రన్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌ తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు కూడా భావించడం తో ఆయన్ను సంప్రదించడం ఆయన నుండి గ్రీన్ సిగ్నల్‌ రావడం కూడా జరిగిందట. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

కన్నడ సినీ ప్రేక్షకులకు వి రవిచంద్రన్ ఇప్పటికి ఒక స్టార్‌. ఆరు పదుల వయసులో కూడా కన్నడ స్టార్‌ హీరోలతో పోటీ పడి నటిస్తున్న రవిచంద్రన్‌ అంటే తెలుగు లో కూడా ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ఆయన నటించిన సినిమాలు తెలుగు లో డబ్బింగ్‌ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

తెలుగు లో ముఖ్యంగా ఆయన నటించిన 'ప్రేమ లోకం' సినిమా డబ్బింగ్‌ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న హీరో గా వి రవిచంద్రన్ నిలిచాడు. ఇన్నాళ్లు పూర్తిగా కన్నడంకు పరిమితం అయిన ఈయన ఇప్పుడు మళ్లీ తెలుగు లో త్రివిక్రమ్‌ ద్వారా రాబోతున్నాడు.